దాదాపు మూడేళ్ల క్రితం ప్రపంచం నెత్తికి చుట్టుకున్న సరికొత్త మహమ్మారి కరోనా. దీని కారణంగా యావత్ ప్రపంచం స్థంభించిపోవటం.. లాక్ డౌన్ మాటను అన్ని దేశాలు చూడటం తెలిసిందే. వైరస్ లు ఎటాక్ చేయటం.. అత్యవసర పరిస్థితులు చోటు చేసుకోవటం లాంటివి సినిమాల్లో కాల్పనిక సీన్లుగా చూడటమే తప్పించి.. ఎప్పుడు రియల్ గా అలాంటి పరిస్థితి ఎదురవుతుందని భావించని ప్రపంచ ప్రజలకు కరోనా ఇచ్చిన షాకులు అన్ని ఇన్ని కావు.
ఈ మహమ్మారి పుట్టినిల్లు అయిన చైనాలో తొలుత కరోనా వైరస్ ను కట్టడి చేయటంతో పాటు.. దాన్ని బలంగా అదిమేసిన వైనం తెలిసిందే. అయితే..
చైనాలో తన సత్తా చాటని ఈ వైరస్.. యావత్ ప్రపంచాన్ని పట్టేసింది. చివర్లో తనకు పుట్టినిల్లు అయిన చైనాను చుట్టేసిన విషయం తాజాగా వెల్లడైంది. పెకింగ్ వర్సిటీకి చెందిన అధ్యయనం ప్రకారం చైనాలో కరోనా బారిన 90 కోట్ల మంది పడినట్లుగా గుర్తించారు.
141 కోట్ల జనాభా ఉన్న చైనాలో దాదాపు 64 శాతం మంది కరోనా బారిన పడినట్లుగా లెక్క కట్టారు. ఇక.. చైనాలో అత్యధిక కేసులు నమోదైన ప్రావిన్స్ లు (మన దేశంలో అయితే రాష్ట్రాలుగా చెప్పొచ్చు) అత్యధికంగా గాన్సు ప్రావిన్స్ లో 91 శాతం మంది కరోనా బారిన పడినట్లుగా గుర్తించారు.తర్వాతి స్థానంలో యునాన్ 84శాతం.. కింఘై 80 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
రానున్న మరో రెండు నెలలు కరోనా తీవ్రత ఉంటుందని భావిస్తున్నారు. ఓపక్క కరోనా కేసులు పెద్ద ఎత్తున నడుస్తున్నా.. మరోవైపు చైనా ప్రజలు మాత్రం కొత్త సంవత్సరం వేడుకల్ని జరుపుకోవటంలోమునిగిపోయారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జీరో కొవిడ్ ను కఠినంగా అమలు చేసిన చైనా ప్రభుత్వం.. గత ఏడాది చివర్లో మాత్రం ఆ విధానాన్నివెనక్కి తీసుకుంది. అంతే..
అప్పటి నుంచి కరోనా కేసులు కోట్లాది చొప్పున నమోదయ్యాయి.అయితే.. కరోనా తీవ్ర దశ ఇంకా ముగిసిపోలేదని.. ఇంతకాలం నగరాల్లో రచ్చ చేసిన మహమ్మారి తాజాగా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళుతున్నట్లుగా చెబుతున్నారు. దీన్నిసమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నాల్ని షురూ చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.