హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన స్పెషల్ ఫ్లైట్ లో ఎవరున్నారు?

Update: 2020-04-08 04:45 GMT
దేశీయంగా లాక్ అవుట్ ప్రకటించింది మోడీ సర్కారు. అంతేనా.. ప్రపంచంలోని మరే దేశంతోనూ సంబంధం లేకుండా.. అంతర్జాతీయ విమానసర్వీసుల్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసుల వ్యాప్తి ఒక కొలిక్కి వస్తే తప్పించి.. మళ్లీ విమాన సర్వీసుల్ని స్టార్ట్ చేయలేమని చెబుతున్నారు. ఇలాంటివేళ.. మంగళవారం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఒక ప్రత్యేక ఎయిరిండియా విమానం అమెరికాకు బయలుదేరి వెళ్లటం ఆసక్తికరంగా మారింది.

ఇంతకీ ఎవరి కోసం ఈ స్పెషల్ ఫ్లైట్ ను అరేంజ్ చేశారు? అన్నది చూస్తే.. హైదరాబాద్ లో చిక్కుకుపోయిన 99 మంది అమెరికన్ల కోసం ఈ ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేశారు. కరోనా నేపథ్యంలో వివిధ దేశాల్లో పలువురు విదేశీయులు చిక్కుకు పోయారు. ఇదే తీరులో హైదరాబాద్ లోనూ పెద్ద ఎత్తున అమెరికన్లు నిలిచిపోయారు.

ఈ నేపథ్యంలో అమెరికా-భారత్ మధ్యన చర్చలు జరిపిన అధికారులు 99 మందిని అమెరికాకు పంపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వారికి హైదరాబాద్ లో ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించారు. అందరికి నెగిటివ్ రావటంతో.. వారిని ప్రయాణానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికా కు ప్రత్యేక ఫ్లైట్ లో 99 మంది అమెరికా కు ప్రయాణమయ్యారు.
Tags:    

Similar News