సీఎం కేసీఆర్ మాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఆయన మాట్లాడటం మొదలు పెడితే ఎంజాయ్ చేయని వారే ఉండరు. ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించే వారు సైతం.. ఆయన మాటలకు మాత్రం అభిమానులుగా ఉండిపోతారు. నిజానికి ఇదే ఆయన్ను మిగిలిన నేతలకు భిన్నంగా నిలిపిందని చెప్పాలి. ఆయన మాట్లాడటం మొదలు పెడితే.. ఎంతసేపైనా అలా వింటూ ఉండేలా మాట్లాడటం.. మాటల మధ్యలో ఆయన చెప్పే చమక్కులు నవ్వులు పూయిస్తుంటాయి.
తాజాగా అలాంటి విషయాన్ని ఒకటి సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో చెప్పి అందరిని నవ్వించారు. కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలు.. వీడియోక్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యన ఒక పెళ్లికి వెళ్లిన సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన చెప్పుకొచ్చారు. అదంతా ఆయన మాటల్లో వింటేనే కిక్ ఉంటుంది. అందుకే.. ఆయన మాటల్ని యథాతధంగా తీసుకుంటే..
‘‘నేనో పెండ్లికి పోయిన. పెండ్లికి పోతే ఆ పెండ్లి పిల్లగాడు ‘సార్ మాస్క్ తీయ్’ అన్నడు. ‘ఎందుకయ్య?’ అంటే.. ‘సార్ నువ్వు మళ్ల దొరుకతవో లేదో ఓ ఫోటో తీసుకుంటా’ అన్నడు. నేను.. ‘నీకు దొరుకతనో లేదో గానీ కరోనాకు దొరుకుతా గదరా బై అన్న’. ఆఖరికి వాడు గుంజా వీడు గుంజా నాక్కూడా వచ్చింది కరోనా’ అంటూ పెళ్లి వేళ తనకు ఎదురైన అనుభవాన్ని కేసీఆర్ చెప్పారు. ఆయన మాటలకు వేదిక మీద ఉన్న వారి దగ్గర నుంచి సభలోని వారంతా హాయిగా నవ్వేశారు. ఇలా.. ఎప్పుడేం మాటలు చెప్పాలో.. ఎలా చెప్పాలో కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు. ఆయన చెప్పిన తాజా మాటల్ని వింటే.. ఎంతటి ఒత్తిడిలో ఉన్నా.. రిలాక్స్ కావటం ఖాయం.
Full View