న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై విచారణకు సీబీఐ స్పీడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసి విచారణ జరుపుతోంది. ఇందులో ఇద్దరు న్యాయవాదులు ఉన్నారు. వారిని తాజాగా కోర్టులో హాజరు పరిచారు. చంద్రశేఖర్, గోపాలకృష్ణ అనే న్యాయవాదులతో పాటు మరో వ్యక్తి కూడా ఈ కేసులో నిందితులగా భావించి అరెస్టు చేశారు. హైదరాబాద్ లో అరెస్టు చేసిన వీరిని గుంటూరుకు తరలించారు. గతంలో సోషల్ మీడియాలో న్యాయవాదులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. తాజాగా ముగ్గురిని కోర్టులో హాజరు పరిచారు.
హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల విషయంలో గతంలో 16 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఓ కంటెంట్ రైటర్ కూడా ఉన్నారు. కోర్టు తీర్పులకు పార్టీల రంగు పులిమి న్యాయమూర్తులపైన, కోర్టులపై అనుచిన వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.
2020లో కేసు నమోదు చేసి 16 మందిని గుర్తించింది. వీరిలో 13 మందిని డిజిటల్ వేదిక ద్వారా గుర్తించారు. మిగతా ముగ్గురు విదేశాల్లో ఉన్నట్లు తేల్చింది. కాగా నిందితుల్లో ఒకరు నకిలీ పాస్ పోర్టు కూడా ఉపయోగించినట్లు తెలిసింది.
తాజాగా విచారణను వేగవంతం చేసిన సీబీఐ తాడేపల్లిలోని ఉండవల్లి సెంటర్ కు చెందిన మెట్టా చంద్రశేఖర్ ను 18వ నిందితుడిగా, గోపాలకృష్ణను 19వ నిందితుడిగా, గుంటా రమేశ్ కుమార్ ను 20వ నిందితుడిగా పేర్కొన్నారు. వీరికి 14 రోజుల పాటు కస్టడికి ఇవ్వాలని సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తరుపున చెన్నకేశవులు వాదనలు వినిపించారు.
అయితే 18వ నిందితుడిగా ఉన్న మెట్టా చంద్రశేఖర్ , 19వ నిందితుడిగా ఉన్న గోపాలకృష్ణ అనే న్యాయవాదులు కోర్టుకు క్షమాపణలు కోరుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. భవిష్యత్లో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయమని అందులో పేర్కొన్నారు. అయితే ఈ కేసును హైకోర్టు సుమోటాగా తీసుకొని విచారిస్తోంది.
అయితే న్యాయస్థానం వారిద్దరిపైన ఉన్న కోర్టు ధిక్కరణ కేసును న్యాయస్థానం మూసివేసింది. కానీ ఈ కుట్రలో వాస్తవాలు వెల్లడించలేదని సీబీఐ పేర్కొంటోంది. కుట్ర విషయం బయటకు రావాలంటే వారిని కస్టడికి ఇవ్వాలని కోరింది. న్యాయమూర్తులు ఇలా వ్యాఖ్యలు చేయడానికి కారణం ఎవరు..? వారి వెనుక ఎవరున్నారు..? అనే సమాచారం రాబట్టాల్సి ఉందని, అందువల్ల వారి కస్టడి కావాలని సీబీఐ అధికారులు కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో వారి అరెస్టుకు కారణాలను వివరిస్తూ వేర్వేరు రిమాండ్ రిపోస్టులను జడ్జి ఎదుట ఉంచారు.
సీఐఐ అధికారులు ఈ కేసులో పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. జడ్జిలపై కొన్ని పోస్టులకు సంబంధించిన మూలాల ఆధారంగా వెతుకుతూ డిజిటల్ కార్పొరేషన్ ను ఆశ్రయించారు. డిజిటల్ మీడియా ద్వారా అసలు కూపీ లాగినట్లు తెలుస్తోంది. ఓ వేదికను ఏర్పాటు చేసుకొని అక్కడేపోస్టులు తయారు చేయించి అప్లోడ్ చేసినట్లు సమాచారం.
ఇప్పటికే అరెస్టు చేసిన నిందితుల నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. కీలక ఆధారాలు లభించడంతో కొందరు ఆ పోస్టులను డెలీట్ చేసినట్లు గుర్తించింది. ఇక తాజాగా ముగ్గురిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఇద్దరు న్యాయవాదులు ఉండడంతో వీరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టాలని చూస్తున్నారు.
ఇందులో భాగంగా వారిని కస్టడి కోరినట్లు తెలుస్తోంది. అయితే న్యాయవాదులపై ఉన్న కోర్టు ధిక్కరణ కేసును మూసి వేయడంతో సీబీఐ అధికారులు ఏవిధంగా విచారణ జరుపుతారోనన్న ఆసక్తి నెలకొంది. ఇక మరో వ్యక్తిని కూడా కస్టడీ కోరడంతో ఆయననూ విచారించనున్నారు.