వేరే అమ్మయితో ఏకాంతంగా ఉన్న వేళ.. భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టేసిన సీఐ భార్య

Update: 2022-11-05 04:12 GMT
అతడో సీఐ. పని చేసేది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ జోన్ పోలీస్ కంట్రోల్ రూంలో ఇన్ స్పెక్టర్ గా. ఆ పోలీసు అధికారికి భార్య.. పిల్లలతో కూడిన కుటుంబం ఉంది. అయితే.. అతను ఫ్యామిలీని వదిలేసి.. వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఇలాంటి వేళ.. భర్త చేస్తున్న చెత్త పని గురించి తెలిసినా.. నోరు మెదపని ఆమె.. తాజాగా భర్త సదరు మహిళతో ఏకాంతంగా ఉన్న సమయాన.. రెడ్ హ్యాండెడ్ గా పట్టేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా.. సంచలనంగా మారింది. అదెలా సాధ్యమైంది? ఎక్కడో హైదరాబాద్ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న భర్తను ఎలా గుర్తించింది? అన్నది ప్రశ్నగా మారింద.

సినిమాల్లో మాత్రమే చూపించే ఈ సీన్.. రియల్ లైఫ్ లోఎలా సాధ్యమైందంటే.. టెక్నాలజీ సాయంతో అని చెప్పాలి. సాధారణంగా పోలీసులు నిందితుల్ని పట్టుకునే విధానాన్నే.. తాజా ఎపిసోడ్ లో ఈ సీఐ సతీమణి .. పోలీసు పద్దతినే వాడటం గమనార్హం. భర్త చేసే చెత్త పనిని రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్న వైనం ఒక ఎత్తు అయితే.. ఆ సందర్భంగా అక్కడకు చేరుకున్న పోలీసులపై దాడికి పాల్పడిన ఉదంతంలో అతడిపై కేసునమోదు చేసి.. రిమాండ్ కు తరలించారు. అయితే.. తన భర్త వేరే మహిళతో చేస్తున్న ఘనకార్యం మీద మాత్రం సదరు మహిళ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

ఈ పోలీసు భార్య.. తాను భర్తలో సగం కాదు.. డబుల్ అన్న రీతిలో వ్యవహరించిందని చెబుతున్నారు. ఇంతకు పోలీసు అధికారి అయిన తన భర్తను సదరు భార్య ఎలా పట్టేసుకుంది? అతడి లీలలు అందరికి తెలిసేలా ఎలా చేయగలిగింది? అన్నది ప్రశ్నగా మారింది.

దీనికి సమాధానం వెతికితే.. ఆమె తనకు అందుబాటులో ఉండే సాంకేతికతను వినియోగించుకొని.. భర్త చేసే పాడు పనిని బట్టబయలు చేసిందని చెబుతున్నారు. పోలీసు అధికారి ఐఫోన్ వాడటం.. అందులో ఉండే ఫైండ్ మై ఫోన్ యాప్ లో.. పోలీసు భార్య తన ఫోన్ నెంబర్ ను ఫీడ్ చేసి.. ట్రాక్ చేసేది. మునుగోడు ఉప ఎన్నికల్లో విధులు నిర్వహణ కోసం వెళ్లిన భర్త.. అక్కడి నుంచి బయలుదేరి చాలాసేపు అయినా ఇంటికి రాకపోవటంతో ఆ పోలీసు భార్య అనుమానించింది.

వెంటనే ట్రాక్ చేయగా.. ఒకే ప్రదేశంలో గంటకు పైగా తన భర్త ఉన్నారని గుర్తించింది. అర్థరాత్రి వేళ సదరు ప్రదేశం నిర్మానుష్యంగా ఉండటంతో అనుమానించి.. పిల్లల్ని వెంట పెట్టుకొని చెక్ చేసేందుకు బయలుదేరింది. వనస్థలిపురం శివారులోని  చెట్ల పొదల్లో తన భర్త ఉన్నారన్న విషయాన్ని గుర్తించిన ఆమె.. నేరుగా వెళ్లి అతడ్ని పట్టేసింది. ఆమె వెళ్లే సరికి తన భర్త వేరే మహిళతో ఏకాంతంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక నిలదీసింది.

అదే సమయంలో ఆ ప్రాంతానికి గస్తీకి వచ్చిన పోలీసులు.. జరిగిందేమిటని ఆరా తీయగా.. సదరు సీఐ మీరెవరు? అంటూ వారిపై దాడికి యత్నించటంతో.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. విషయం ఉన్నతాధికారులకు వెళ్లటం.. వారి సూచనలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడికి యత్నించిన కేసులోఅతడ్ని రిమాండ్ కు పంపారు. చిన్న టెక్నాలజీ టెక్నిక్ తో ఈ పోలీసు భార్య తన భర్త చేసే చెత్తపనిని ఇట్టే కనిపెట్టి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టేసినట్లుగా చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News