ప్రపంచంలోనే అతి పొడవైన గుండ్రని ఆక్వేరియం జర్మనీలోని బెర్లిన్ నగరంలో ఉంది. 'ఆక్వాడోమ్' అని పిలిచే భారీ ఆక్వేరియంను రాడసిన్ హోటల్ యాజమాన్యం 2003లో పర్యాటకుల ఆకర్షించేందుకు ఏర్పాటు చేసింది. 10 లక్షల లీటర్ల నీటితో 14 మీటర్లు(46 అడుగుల) ఎత్తుతో నిర్మిస్తున్న ఈ ఆక్వేరియంలో సుమారు 1500 ల చేపలు ఉన్నాయి.
ఈ ఆక్వేరియం శుక్రవారం తెల్లవారుజామున అనుహ్యంగా పగిలిపోయి భారీ నష్టం వాటిల్లింది. ఆక్వేరియంలోని నీరంతా హోటల్ గదుల్లోకి చేరడంతో పాటు ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. ఈ సంఘటనలో ఆక్వేరియం గాజులు పగిలిపోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. చెల్లాచెదురుగా మారిన ఆక్వేరియం శిథిలాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ సంఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకొని హోటల్ ల్లో బస చేస్తున్న అతిథులను తరలించే ప్రయత్నం చేశారు. ఆక్వేరియంలోని చేపలను రక్షించేందుకు హోటల్.. అగ్నిమాపక సిబ్బంది ఎంతో ప్రయత్నించారు. అయితే తెల్లవారుజామున చలి తీవ్రత కారణంగా చాలా చేపలు మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఆక్వేరియంలో 100 రకాల విభిన్నమైన చేపలు ఉన్నాయి.
ఆక్వేరియం పేలుడు సంభవించిన సమయంలో పాల్ మాలెట్జీ.. ఆయన గర్ల్ ఫ్రెండ్ తో హోటల్లోని నాలుగో అంతస్తులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ ఆక్వేరియం భారీ శబ్దంతో పేలడంతో హోటల్ భవనం మొత్తం ఒక్కసారిగా కంపించిందని తెలిపారు. దీంతో తమకు వెంటనే మెలకువ వచ్చిందన్నారు.
హోటల్ లాబీలోకి తొంగి చూసినపుడు నీరంతా పొంగుతూ కనిపించిందని వివరించారు. ఆ వెంటనే సాయుధ పోలీసులు తమను.. ఇతర గదుల్లోని అతిథులను బయటకు తీసుకెళ్లారని చెప్పారు. ఈ ప్రమాదం తర్వాత బెర్లిన్ మేయర్ ఫ్రాన్జిస్కా జిఫ్పే హోటల్‌ను సందర్శించారు. ప్రమాద తీవ్రతను.. జరిగిన నష్టాన్ని అంచనా వేశారు.
ఆక్వేరియం పేలుడు మినీ సునామీలాగా ఉందని ఆమె అభివర్ణించారు. ప్రమాదం తెల్లవారుజామున జరుగడంతో ప్రాణ నష్టం పెద్దగా సంభవించలేదని తెలిపారు. ప్రమాదం మరో గంట ఆలస్యంగా జరిగి ఉంటే రోడ్డు మీద చిన్నారులతో సహా సందర్శకుల రద్దీగా వీపరీతమైన నష్టం వాటిల్లిందని తెలిపారు. అదృష్టవశాత్తు అలాంటిదేమీ జరగలేదని పేర్కొన్నారు. 2003లోనే ఈ ఆక్వేరియం నిర్మాణానికి సుమారు 1.28 యూరోలు (112 కోట్ల రూపాయలు) ఖర్చు చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.