అండర్ వేర్ బదులు అరటిపండ్లు కట్టుకున్నాడు ... ఎందుకంటే !

Update: 2020-10-28 16:50 GMT
కరోనా ..కరోనా ..ఈ మహమ్మారి దెబ్బకి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా జన జీవనం లో అనేక మార్పులు వచ్చాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇంకా ఈ మహమ్మారి ప్రభావం తీవ్రంగా కొనసాగుతుంది. అగ్రరాజ్యం అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య 90 లక్షలకి చేరగా .. భారత్ లో ఆ సంఖ్య 80 లక్షలకి చేరువలో ఉంది. ఈ కరోనా మహమ్మారి దెబ్బకి ఆ దేశం, ఈ దేశం అని కాదు ..మొత్తం అన్ని దేశాల పరిస్థితులు అస్తవ్యస్తం అయ్యాయి. ఇక ఈ మహమ్మారిని అడ్డుకోవడానికి మన ముందున్న ఏకైక లక్ష్యం లాక్ డౌన్. ఈ వ్యాధి వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో ప్రపంచం మొత్తం లాక్ డౌన్ ను అమలు చేసింది. కానీ , కరోనా భయంతో లాక్ డౌన్ అమలు చేస్తే , ఉపాధి లేక ఎంతోమంది జీవితం అస్తవ్యస్తం అయింది. అలాగే పలు దేశాల ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది.

దీనితో కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు , కరోనా సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలని , లాక్ డౌన్ నుండి కొన్నింటికి సడలింపులు ఇస్తూవస్తున్నారు. అయితే , కరోనా మహమ్మారి జోరు మాత్రం ఏ మాత్రం తగ్గడంలేదు. ఇక ఈ మద్యే కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ , థర్డ్ వేవ్ మొదలైంది. దీనితో చాలా దేశాల్లో మరోసారి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. బ్రిటన్ లో కూడా కరోనా మహమ్మారి కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలో అక్కడ ప్రస్తుతం లాక్ డౌన్ అమల్లో ఉంది. అయితే , బ్రిటన్ లో వేల్స్ ప్రాంతంలో లాక్ డౌన్ విధిస్తూ అమలు చేస్తున్న నిబంధనలపై ప్రజల నుండి తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతుంది. అక్కడ కేవలం నిత్యావసర సరుకులు సరఫరా చేసే షాప్స్ కి మాత్రమే తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. అయితే , బట్టల షాప్స్ కి అనుమతి ఇవ్వలేదు. అయితే బట్టలు కూడా నిత్యావసర సరుకులే అని , ఆ షాప్స్ కూడా ఓపెన్ చేయాలని అక్కడి వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఓ వ్యక్తి నిరసన తెలుపుతూ .. అండర్ వేర్ నిత్యావసరం కానప్పుడు ,ధరించాలని రూల్ ఏమిలేదు కదా అని అండర్ వేర్ కి బదులుగా అక్కడ అరటిపండ్లు కట్టుకొని తన నిరసన తెలుపుతున్నాడు.
Tags:    

Similar News