ప్రేమ విఫలం అయితే ఇంకా కూడా ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడటం మనం చూస్తూనే ఉన్నాం. ఇండియాలో ప్రతి రోజు ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. లవర్స్ ఆత్మ హత్య అంటూ మీడియాలో వార్తలు రావడం చాలా కామన్ అయ్యింది. అయితే ఈసారి ఆత్మహత్య చేసుకున్న లవర్స్ చాలా ప్రత్యేకం. వీరిద్దరు కూడా ఆత్మహత్య చేసుకునే ముందు తలలకు గన్స్ ను గురి పెట్టుకుని సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తర్వాత ఒకరిని ఒకరు కాల్చి చంపేసుకున్నారు.
రాజస్థాన్ రాష్ట్రం బర్మార్ జిల్లా కేంద్రంకు చెందిన అంజు సుతార్ కు ఇటీవలే పెళ్లి అయ్యింది. అయితే పెళ్లి ఇష్టం లేకపోవడంతో అంజు సుతార్ పారిపోయి వచ్చింది. చాలా ఏళ్లుగా ప్రేమిస్తున్న శంకర్ వద్దకు అంజు వచ్చింది. అంజు పెళ్లికి ముందే వీరిద్దరు కొన్నాళ్ల పాటు సహజీవనం సాగించారు. అయితే వీరిద్దరి కుటుంబ సభ్యులు వేరు చేసి అంజుకు పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత కూడా శంకర్ పై ప్రేమను చంపుకోలేక అంజు భర్తను వదిలేసి వచ్చేసింది.
పెద్దలు తమను కలిసి బతకనివ్వడం లేదని అందుకే కలిసి చనిపోవాలనుకుంటున్నట్లుగా వాయిస్ రికార్డ్ చేసి ఆ తర్వాత రెండు గన్స్ ను తలకు గురి పెట్టుకుని ఫొటో దిగి ఆ తర్వాత కాల్చుకున్నట్లుగా తెలుస్తోంది. విషయం తెలిసి సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు శవాలను పోస్ట్ మార్టంకు పంపించారు. చనిపోయే ముందు ఇద్దరు కూడా ఆల్కహాల్ తీసుకున్నట్లుగా వెళ్లడయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.