ఏపీలో రోజురోజుకి కరోనా భాదితుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రతిరోజూ కూడా వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలు దాటింది. అయినా పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. దీనికి తోడు కరోనా టెస్టుల ఫలితాలతో ఏపీ వాసులకి షాక్ తగులుతోంది. కొంతమంది పరీక్షలు చేయించుకోకపోయినా పాజిటివ్ వచ్చిందంటూ మొబైల్స్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి.
టెస్టులు చేయడం సంగతి పక్కన పెడితే చేసిన వాటికి రిపోర్టుల విషయంలో కూడా గందరగోళం కొనసాగుతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోనూ ఓ యువకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. కరోనా టెస్టులు నిర్వహించి పాజిటివ్, నెగిటివ్ అంటూ కన్ఫ్యూజ్ చేశారు. కాకినాడలో ఓ యువకుడు కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. అతడి రిపోర్టలు వచ్చాయి.. ముందు యువకుడికి పాజిటివ్ వచ్చిందని జిల్లా కొవిడ్ కంట్రోల్ రూమ్ నుంచి సోమవారం ఫోన్ చేశారు. స్థానిక ఏఎన్ ఎం వెళ్లి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. అయితే , కాసేపటికే మళ్లీ కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ ద్వారా నెగెటివ్ రిపోర్టు వచ్చిందని యువకుడికి షాకిచ్చారు.
అయితే ఆ తరువాత కొద్దిసేపటికే మళ్లీ ఫోన్ చేసి పాజిటివ్ అన్నారు. దీంతో ఆ యువకుడు ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉండిపోయాడు. అసలు కరోనా నెగటివ్ వచ్చిందా లేదా పాజిటివ్ వచ్చిందా అన్న విషయం అర్థంకాలేదు. అయితే , ఆ తరువాత ఈ వ్యవహారంపై స్పందించిన అధికారులు చివరికి ఆ యువకుడికి కరోనా పాజిటివ్ అని అధికారులు నిర్ధారించి హోం ఐసోలేషన్ లో ఉంచారు. ఈ ఘటన పై కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి స్పందించారు. అతడికి పాజిటివ్ వచ్చిందని స్పష్టం చేసారు. కంప్యూటర్ ఆపరేటర్ వల్ల పొరపాటు జరిగిందన్నారు. మొత్తానికి టెస్టుల విషయంలో గందరగోళంతో జనాలు ఇబ్బందులుపడుతున్నారని ఏపీ వాసులు చర్చించుకుంటున్నారు.