బాలీవుడ్ అందాల తార శ్రీదేవి హఠాత్మరణం ఇప్పుడు దేశంలోని ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేసిందనే చెప్పాలి. పెళ్లి వేడుక కోసం భర్త, కూతురుతో కలిసి విదేశాలకు వెళ్లిన శ్రీదేవి.. అక్కడే విగతజీవిగా మారి... నిర్జీవంగా భారత్‌కు తిరిగి వస్తోందన్న విషయమే ఇప్పుడు ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. నిన్న రాత్రి దుబాయిలో సడెన్ హార్ట్ అటాక్ కారణంగా శ్రీదేవి క్షణాల్లోనే ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. తమ బంధువర్గానికి చెందిన ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషీతో కలిసి దుబాయి వెళ్లిన శ్రీదేవి సదరు వివాహ వేడుకలో నిన్న రాత్రి దాకా చాలా హుషారుగా కనిపించారు. భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో దేవకన్యలా మెరిసిపోయిన శ్రీదేవి పెళ్లి వేడుకకు హాజరైన అందరినీ కలుపుగోలుగా పలకరిస్తూ చాలా హుషారుగా కనిపించారు. వేడుక ముగిసేదాకా కూలా ఉల్లాసంగానే కాకుండా ఉత్సాహంగా కనిపించిన శ్రీదేవి... విడిది హోటల్ గదికి చేరుకున్న తర్వాత గుండెపోటుకు గురయ్యారు.
నిన్న రాత్రి 11 గంటల సమయంలో వచ్చిన హార్ట్ స్ట్రోక్ తో శ్రీదేవి కోలుకోలేకపోయారు. గుండె పట్టుకుని పడిపోయిన ఆమె అలాగే కన్నుమూశారు. అప్పటిదాకా హుషారుగా సందడి చేసి వచ్చిన తన సతీమణి తన కళ్లెదుటే కిందపడిపోయిన వైనం చూసిన బోనీ కపూర్ నిశ్చేష్టులయ్యారు. ఇక అప్పటిదాకా తనతో పాటు సంతోషంగా గడిపిన తల్లి తన కళ్లెదుటే విగత జీవిగా మరణించిన వైనం ఖుషీని షాక్ కు గురి చేసిందనే చెప్పాలి. మొత్తంగా వివాహ వేడుకకు వెళ్లిపోయిన శ్రీదేవి... తుదిశ్వాస విడిచి ఆ వేడుకకు వచ్చిన వారితో పాటు కోట్లాది మంది భారతీయులను తీవ్ర శోకసంద్రంలో ముంచేశారు. శ్రీదేవి మరణంలో బాలీవుడ్ సహా భారత రాజకీయ రంగ ప్రముఖులు షాక్ తిన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రీదేవి జ్ఞాపకాల దొంతర్లే దొర్లుతున్నాయి.
తమిళనాట పుట్టి చిన్న వయసులోనే సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రీదేవి... తనదైన అందం - నటనతో దక్షిణాది ప్రేక్షకుల మనసును చూరగొన్నారు. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిన శ్రీదేవి టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. అయితే ఎంత వేగంగా ఎదిగారో - అంతే వేగంగా ఆమె అంతర్థానమైపోతున్న వైనం నిజంగా జీర్ణించుకోలేనిదేనని చెప్పక తప్పదు బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్‌ను వివాహం చేసుకుని ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చిన శ్రీదేవి... ప్రస్తుతం కూతుళ్ల కెరీర్ ను పకడ్బందీగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి కీలక తరుణంలో శ్రీదేవి హఠాత్మరణం ఆమె కుటుంబానికి తీరని లోటేనని చెప్పాలి. ఇక శుభకార్యానికి దుబాయి వెళ్లిన శ్రీదేవి అక్కడే కన్నుమూసిన నేపథ్యంలో ఆమె పార్థివదేహాన్ని భారత్ కు తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
తమ అభిమాన తారను కడసారి చూసుకునేందుకు యావత్తు భారత ప్రజలు ఆశగా ఎదురు చూస్తుండగా... శ్రీదేవి భౌతిక కాయం ముంబై చేరడానికి మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి. శ్రీదేవి భౌతిక కాయాన్ని ముంబైకి తీసుకొచ్చేందుకు ఇక్కడి నుంచే ప్రత్యేక విమానాన్ని దుబాయి పంపుతున్నారు. కాసేపటి క్రితం దుబాయి బయలుదేరిన సదరు ప్రైవేట్ జెట్... మరికాసేపట్లో ఆమె పార్థివదేహాన్ని తీసుకుని అక్కడి నుంచి తిరుగు ప్రయాణం కానుంది. ఎంత త్వరగా బయలుదేరినా కూడా శ్రీదేవి భౌతిక కాయాన్ని తీసుకొచ్చే సదరు జెట్ నేటి రాత్రి 8 గంటలకు గానీ ముంబై చేరుకునే అవకాశాలు లేవన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా తనదైన సత్తాలో స్టార్ డమ్ ను తెచ్చుకున్న శ్రీదేవి... తన కడసారి చూపునకు కూడా అభిమానులను గంటల తరబడి వేచి చూసేలా చేస్తోందని చెప్పక తప్పదు.