ప్రధాని నరేంద్రమోడీపై అభ్యంతరకరంగా ట్వీట్ చేసిన సీనియర్ పైలట్ ను గోఎయిర్ యాజమాన్యం నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగంలోంచి తొలగించింది. ‘మికి మాలిక్’ అనే ఈ పైలట్ ను తక్షణమే విధుల్లోంచి తొలగిస్తున్నట్టు పేర్కొంది.
అయితే తన ట్వీట్ పై తరువాత మాలిక్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఎవరిని ఉద్దేశించి తను ఆ ట్వీట్ చేయలేదని.. ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని ఆయన విన్నవించారు. తన వ్యాఖ్యలకు.. తన సంస్థకు ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
కానీ గోఎయిర్ ఎయిర్ మేనేజ్ మెంట్ మాత్రం సీరియస్ అయ్యింది. తమది జీరో టాలరెన్స్ పాలసీ అని.. సిబ్బంది అంతా తమ రూల్స్ కి అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక ట్వీట్లను వారి వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రం అర్థం చేసుకోవాలని కోరింది.
ఇక గోఎయిర్ యాజమాన్యం ఇదివరకు కూడా రామాయణ సీత, హిందూయిజం పై అభ్యంతరక ట్వీట్లు చేసిన ట్రెయినీ పైలట్ పై కఠిన చర్యలు తీసుకుంది. గత జూన్ లో విధుల నుంచి తొలగించింది.