వ్యవస్థల మీద పోరాడటం ఇప్పటిపరిస్థితుల్లో చాలా కష్టం. రాజ్యానికి లక్ష్యంగా మారితే.. తిప్పలు ఎంతలా ఉంటాయో సెలబ్రిటీ జర్నలిస్టు.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఆర్నాబ్ గో స్వామి ఎపిసోడ్ ను చూస్తున్నప్పుడు ఇట్టే అర్థమైపోతుంది. రోటీన్ జర్నలిస్టులకు ఆయన భిన్నం. తన ముందు కూర్చున్న ఎంత పెద్ద నాయకుడ్నిఅయినా సరే.. తన మాటలతో.. ప్రశ్నలతో కడిగిపారేయటమే కాదు.. నోటివెంట మాట రాకుండా చేయటంలో ఆయన ప్రత్యేకత వేరు. భారతదేశం అడుగుతోందంటూ.. చుక్కలు చూపించిన ఆయన.. ఇప్పుడు అంతకంతకూ సమస్యల వలయంలోకి చిక్కుకుపోతున్నారా? అన్నది ప్రశ్నగా మారింది.
అప్పుడెప్పుడో జరిగిన ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆర్నాబ్.. ఆ కేసును తర్వాతి కాలంలో మూసేశారు. తాజాగా మళ్లీ తెరవటమే కాదు..ఈసారి ఏకంగా అరెస్టు చేయటం.. ఆయనకు బెయిల్ రాకపోవటం వరుస పెట్టి జరిగిపోతున్నాయి. బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాను అరెస్టు చేసే వరకు వదిలి పెట్టని ఆర్నాబ్.. ఇప్పుడు అలాంటి ఆత్మహత్య కేసులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆర్నాబ్ కు చెందిన రిపబ్లిక్ చానల్ ఇవ్వాల్సిన రూ.5కోట్లు ఇవ్వకపోవటంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సూసైడ్ నోట్ రాసి మరణించిన ఉదంతంలో ఇప్పుడాయన ఊచలు లెక్క పెడుతున్నారు. పోలీసులు తనను అరెస్టు చేసిన తర్వాత విచారణ పేరుతో తనపై భౌతికదాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేకాదు.. బెయిల్ కోసం ఆయన ప్రయత్నిస్తే.. కోర్టు ఇవ్వకపోవటంతో క్వారంటైన్ సెంటర్లో ఉంటున్నారు.
జైలు జీవితంలో ఉన్న నిందితులందరికి కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయన్నది మర్చిపోకూడదు. అందుకు ఆర్నాబ్ మినహాయింపు కాదు. నిజానికి బెయిల్ ఇవ్వకూడనంత పెద్ద నేరం ఆర్నాబ్ చేశారా? అన్నది ప్రశ్న. బెయిల్ ఇస్తే.. పారిపోయే పరిస్థితి ఉందని అస్సలు చెప్పలేం. అయినప్పటికీ ఆయనకు బెయిల్ ఎందుకు లభించదు? అన్నది ప్రశ్న. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. జరుగుతున్న పరిణామాల్నిచూస్తుండిపోవటం తప్పించి.
అప్పుడెప్పుడో జరిగిన ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆర్నాబ్.. ఆ కేసును తర్వాతి కాలంలో మూసేశారు. తాజాగా మళ్లీ తెరవటమే కాదు..ఈసారి ఏకంగా అరెస్టు చేయటం.. ఆయనకు బెయిల్ రాకపోవటం వరుస పెట్టి జరిగిపోతున్నాయి. బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాను అరెస్టు చేసే వరకు వదిలి పెట్టని ఆర్నాబ్.. ఇప్పుడు అలాంటి ఆత్మహత్య కేసులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆర్నాబ్ కు చెందిన రిపబ్లిక్ చానల్ ఇవ్వాల్సిన రూ.5కోట్లు ఇవ్వకపోవటంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సూసైడ్ నోట్ రాసి మరణించిన ఉదంతంలో ఇప్పుడాయన ఊచలు లెక్క పెడుతున్నారు. పోలీసులు తనను అరెస్టు చేసిన తర్వాత విచారణ పేరుతో తనపై భౌతికదాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేకాదు.. బెయిల్ కోసం ఆయన ప్రయత్నిస్తే.. కోర్టు ఇవ్వకపోవటంతో క్వారంటైన్ సెంటర్లో ఉంటున్నారు.
అక్కడ స్నేహితుడి మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్న కారణంగా ఆయన నుంచి ఫోన్ స్వాధీనం చేసుకొని.. తలోజి జైలుకు పంపటం చూస్తే..కొందరి విషయంలో చట్టం ఎందుకంత కఠినంగా ఉంటుందన్నభావన కలుగక మానదు. అర్నాబ్ లాంటి జర్నలిస్టు ఎప్పుడు ఏం చేయాలో తెలీకుండా ఉంటుందా? నిజంగానే నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ వాడుతుంటే.. ఆయనకు ఆ విషయం ముందే చెప్పాలి కదా? అలా కాకుండా.. ఫోన్ పేరుతో జైలుకు పంపిన తీరు చూస్తే.. సమ్ థింగ్ రాంగ్ అన్న భావన కలుగక మానదు.