టీమ్ ఇండియా ఆడాల్సిన 5వ టెస్టు కోవిడ్ కారణంగా రద్దు కావడంతో ఆటగాళ్లు అందరూ ఇంగ్లాండ్ నుండి తిరుగు ప్రయాణం అవుతున్నారు. మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2021 రెండవ ఫేజ్ ప్రారంభం కానుండటంతో ఇంగ్లండ్ టూర్ లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు యూఏఈకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ కెప్టెన్ విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ ను లండన్ కు పంపించనుంది. ప్రత్యేక విమానంలో దుబాయ్ కి చేరుకోనున్న ఈ ఇద్దరు ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు.
ఈ విషయాన్ని ఆర్‌సీబీ ఒక ప్రకటనలో తెలిపింది. కోహ్లి, సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్‌ను సిద్ధం చేశాం. శనివారం రాత్రి కోహ్లి, సిరాజ్‌లు చార్టర్ ఫ్లైట్ ఎక్కుతారు. ఆదివారం ఉదయం దుబాయ్ లో దిగిన వెంటనే నిబంధనల ప్రకారం ఆరు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండనున్నారని ఆ ప్రకటనలో తెలిపారు. ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆర్సీబీ మంచి ప్రదర్శనే చేసింది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో కేవలం రెండు ఓటములే పొందిన ఆర్సీబీ మొత్తంగా 10 పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉన్నది.
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా సాధించని బెంగళూరు జట్టు ఈ సారి టైటిల్ మీద కన్నేసింది. ఆర్సీబీ జట్టు ఒక సీజన్ లో వరుస విజయాలు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు ఐపీఎల్ 2021 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆర్సీబీ జట్టులో కీలక ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా రెండో ఫేజ్ కు పూర్తిగా దూరమయ్యాడు. ఇప్పటికే ఆర్సీబీ జట్టు కోచ్ సైమన్ కటిచ్ తో సహా పలువురు విదేశీ క్రికెటర్లు రెండో దశకు అందుబాటులో ఉండమని చెప్పారు. అలాంటి సమయంలో ఆల్ రౌండర్ సుందర్ దూరం కావడం జట్టుకు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పుకోవచ్చు. భారత జట్టుతో కలసి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన వాషింగ్టన్ సుందర్.. దుర్హమ్ లో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో గాయపడ్డాడు. దీంతో టీమ్ మేనేజ్ మెంట్ అతడిని తిరిగి ఇండియా పంపించేసింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు.