కేంద్ర ప్రభుత్వంలో పెద్ద పెద్ద నేతలు ఉన్నారు. ఎన్నే ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నవారు ఉన్నారు. అయితే అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా , తరువాత, అంతంగా తెలిసిన మంత్రి స్మృతి ఇరానీ అనడం అతిశయోక్తి కాదు.
కేంద్ర మంత్రిగా ఆమె ఏం చేశారు. ఏం చేస్తున్నారు అన్నది పక్కన పెడితే, విమర్శలు చేయడంతో ఆమెకు ఆమె సాటి, ప్రత్యర్థి నేత ఎవరైనా, తన పదునైన తూటాలాంటి మాటలతో ఉక్కిరి బిక్కిరి చేయడంలో ఆమె నెంబర్ వన్ అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం లో మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు.
అతిథిగా ఆహ్వానించిన షోకే నో ఎంట్రీ అనడంలో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది ఆమె. ఇటీవలే రచయిత్రి గా మారిన స్మృతి తన బుక్ ను ప్రమోట్ చేసుకోవడానికి పాపులర్ టెలివిజన్ కపిల్ శర్మ కామెడీ షో లో అతిథిగా పాల్గొనాల్సి ఉంది స్మృతి.
అయితే, దీనికి సంబంధించిన షూటింగ్ కోసం ఆమె లొకేషన్ సెట్ కు చేరుకోగా, అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఆమెను లోపలకు అనుమతించడానికి నిరాకరించాడట. ఈ షోకు తాను గెస్ట్ అని చెప్పినప్పటికీ దీని గురించి మాకెలాంటి సమాచారం లేదు మేడం, సారీ అంటూ నో ఎంట్రీ బోర్డు పెట్టారట. ఈ పరిణామంతో స్మృతి వెనుదిరగక తప్పలేదు.
అయితే ఇదంతా సెట్ లోపల బిజీగా ఉన్న కపిల్ శర్మ అండ్ టీంకు అస్సలు తెలియదట. తీరా జరిగిన విషయం తెలిశాక సెట్ లో గందరగోళం నెలకొంది. అంతేకాదు షూటింగ్ కు ప్యాకప్ కూడా చెప్పేశారు. అంతేకాదు స్మృతి ఇరానీకి కపిల్ శర్మ అండ్ టీం జరిగిన దానికి క్షమించమని కోరారట.
నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. కపిల్ శర్మ షో మేకర్స్ కావాలనే ఇలా చేశారని, స్మృతి ఇరానీ ఒక రాజకీయ వేత్త, నటి కూడా, ఆమె గురించి తెలియనివారు ఉండరు. అలాంటిది ఆమెను ఇలా సెట్ లోకి అనుమంతించకుండా ఎలా ప్రవర్తిస్తారు అంటూ మండిపడుతున్నారు ఆమె అభిమానులు.
స్మృతి ఇరానీ చిన్నప్పటి నుంచి ఆర్ ఎస్ ఎస్ తో అనుబంధం కొనసాగించారు. ఆమె తాత ఆర్ ఎస్ ఎస్ వాలంటీర్. తల్లి జన్ సంఘీ. దీంతో 2003లో బీజేపీలో స్మృతి ఇరానీ చేరారు.
మహారాష్ట్ర యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ 2004లో ఎంపిక అయ్యారు. అదే సంవత్సరం లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ సిబల్ పై పోటీ చేసి ఓడిపోయారు. 2010లో స్మృతి బీజేపీ జాతీయ కార్యదర్శిగా, మహిళా విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.
2014లో యూపీలోని అమేథీ స్థానం నుంచి రాహుల్ గాంధీపై లోక్ సభకు పోటీ చేసి ఇక్కడ కూడా ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి అమేథీ పార్లమెంట్ నుంచి ఆమె గెలిచారు. స్మృతి ఇరానీ ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.