అవును.. మీరు చదివింది కరెక్టే. కొవిడ్ మహమ్మారి ఆట కట్టించేందుకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ పరిశోధనలు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో మూడు రకాలైన టీకాల్ని వేస్తున్నారు. పలు టీకాలు దేశంలోకి ఎంట్రీ ఇవ్వటానికి అప్లికేషన్లు పెట్టుకుంటున్నాయి. తాజాగా జైడస్ కాడిలా సంస్థ తన ‘జైకొవ్-డీ’ వ్యాక్సిన్ వినియోగానికి అవసరమైన అనుమతుల కోసం కేంద్రానికి అప్లికేషన్ పెట్టుకుంది. ఈ వ్యాక్సిన్ కు బోలెడన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
మిగిలిన టీకాలకు దీనికి ఉన్న పెద్ద తేడా ఏమంటే.. ఈ టీకా వేసేందుకు సూది అవసరం లేదు. సూది లేకుండా నొప్పి తెలీకుండా ఈ టీకాను వేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. అందుకు అవసరమైన సాంకేతికతను సిద్ధం చేసినట్లు చెబుతోంది. ప్రపంచంలోనే తొలి ప్లాస్మిడ్ డీఎన్ఏ కొవిడ్ 19 వ్యాక్సిన్ ఇదే కావటం గమనార్హం.
భారత్ లో 12 - 18 సంవత్సరాల మధ్యలోని వారిపై క్లినికల్ టెస్టులు నిర్వహించిన తొలి కరోనా టీకా ఇదే కావటం మరో విశేషంగా చెప్పాలి. సూది మందు అంటే చాలు వెనక్కి తగ్గే వారికి.. బెరుకుగా ఫీలయ్యే వారికి ఈ టీకాతో ఫుల్ హ్యాపీ అని చెప్పాలి. రాజకీయంగా తిరుగులేని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూదిమందు అంటే అస్సలు ఇష్టం ఉండదు. తనకు సూది మందు ఇవ్వాల్సి వస్తే.. దాన్ని ఏదోలా స్కిప్ చేస్తారని చెబుతారు. అలాంటి ఆయనకు సూది లేని ఈ టీకా గురించి తెలిస్తే ఫుల్ హ్యాపీ కావటం ఖాయం.
సూది లేకుండా టీకా ఏలా? అన్న సందేహం రావొచ్చు. దీనికి జైడస్ కాడిలా చెబుతున్న సమాధానం ఏమంటే.. వ్యాక్సిన్ ఇవ్వటానికి ప్రత్యేకంగా ఒక అప్లికేటర్ ను ఈ సంస్థ తీసుకొస్తోంది. ఈ సాంకేతికతను ఫార్మాజెట్ అనే సంస్థతో రూపొందించినట్లు చెబుతోంది. దీంతో..నొప్పి అన్నది లేకుండా టీకా వేసుకోవచ్చని అభయమిస్తోంది.