పెళ్లి వేడుకల్లో మెరిసిపోతున్న వధువు.. అంతలోనే పేలుళ్లు..అంతా పరుగులు

Update: 2020-08-07 04:15 GMT
లెబనాన్ రాజధాని బీరూట్ వేలాది మందికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఎంతోమంది తమ వాళ్లను పోగుట్టు కోగా కొందరు ప్రాణాలకు తెగించి తమ వాళ్ళను కాపాడుకుంటున్న వీడియో దృశ్యాలు కదిలించాయి. బీరూట్ లోని ఓ పోర్టులో జరిగిన భారీ పేలుడుతో 135 మంది చనిపోగా, సుమారు 5 వేల మంది గాయపడ్డారు. పేలుళ్లు సంభవించిన సమయంలో బయట పడ్డవారు ఆ క్షణంలో తాము అనుభవించిన బాధను వ్యక్త పరుస్తున్నారు.

అమెరికాలో డాక్టర్ గా పని చేసే ఇస్రా పెళ్లి కోసం బీరూట్ వచ్చింది. వారంలో పెళ్లి. దానికి సంబంధించి ముందస్తు వేడుకలు ప్రారంభించారు. ఇస్రా పెళ్లి కూతురు డ్రెస్ లో ముస్తాబవగా కెమెరా మెన్ వీడియో తీస్తున్నాడు. ఆమె తల్లిదండ్రులు పక్కనే ఉండి ఇస్రాను చూస్తూ సంతోషాన్ని ఆస్వాదిస్తున్నారు. 'ఆ సమయంలో ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. వేడుకలో ఉన్నవారు తలా ఒక దారిన పరుగందుకున్నారు. ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదు. అసలు బతికి బయట పడతానా.. ఇలా ఎన్నెన్నో ఆలోచనలు ఒక్కసారి గా సుడులు తిరిగాయి. ఆ పేలుళ్లకు ఎంతోమంది చనిపోయారు. గాయపడ్డారు. నేను మాత్రం సురక్షితంగా బయట పడ్డాను. నిజంగా మమ్మల్ని ఆ దేవుడే కాపాడంటూ' ఇస్రా తన భావోద్వేగాలను పంచుకుంది.
Full View
Tags:    

Similar News