ప్రియురాలుకు 5 లక్షలకు భర్తను అమ్మిన భార్య..

Update: 2019-10-18 13:37 GMT
వివాహేతర సంబంధం ఆ పచ్చటి కుటుంబం మధ్య చిచ్చుపెట్టింది. భర్త పరాయి స్త్రీ వ్యామోహంలో పడి ఆమెకే బానిస కావడం చూసి చిర్రెత్తుకొచ్చిన భార్య ఆ ప్రియురాలికే భర్తను రూ.5 లక్షలకు అమ్మేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

భార్యను పెడచెవిన పెట్టిన భర్త తరుచూ అదే గ్రామంలోని ఓ మహిళ వద్దకు వెళ్లి రాసలీలలు సాగిస్తున్నాడు. దీనిపై భార్య హెచ్చరించినా భర్త వినలేదు. చివరకు భార్య.. సదురు ప్రియురాలితో రాసలీలలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని భార్య, ఆమె బంధువులు చితకబాదారు. వెంటనే గ్రామంలో పంచాయతీ పెట్టి భర్తను, మహిళను బజారుకీడ్చారు..

అయితే నీ భర్త నా దగ్గర రూ.5 లక్షలు అప్పు చేశాడని.. ఆ అప్పు తిరిగి ఇస్తేనే నీ భర్తను వదిలేస్తానని ఆ మహిళ పంచాయతీలో తేగెసి చెప్పింది.  ఆ 5 లక్షలు ఇవ్వలేనని డిసైడ్ అయిన భార్య భర్తనే వదిలేస్తానంది. దీంతో ప్రియురాలు తాను కొంటానని బదులిచ్చింది. రూ.5 లక్షలకు భర్తను అమ్మకానికి పెట్టింది. లేదంటే కోర్టులో తేల్చుకుంటానంది. దీంతో ప్రియురాలు  రూ.5 లక్షల డీల్ కు ఓకే చెప్పింది. నవంబర్ లో ఈ 5 లక్షలు ఇచ్చి తన భర్తను తీసుకెళ్లాలని భార్య చెప్పింది.

ఇలా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను ఏకంగా 5 లక్షలకు అదే ప్రియురాలికి అమ్మిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News