ధనికులకు గాలం .. ముగ్గులోకి దించి , బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళ

Update: 2020-09-22 00:30 GMT
ఆడవారిని మోసం చేసే వారు కొందరైతే , ఆడవారి శరీరాలతో వ్యాపారం చేసే వారు మరికొందరు. అయితే, మరికొందరు ఆడవారే ఏకంగా డబ్బున్న వారిని ఏరుకొని , ముగ్గులోకిదించి, శారీరకంగా లొంగదీసుకొని , ఆ సమయంలో రహస్యంగా వీడియోలు తీసి, ఆ వీడియోలు చూపించి వారిని బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా కొత్తగూడెం , పాల్వంచ పట్టణంలో చోటుచేసుకుంది.

టీచర్స్‌కు కాలనీకి చెందిన ఓ మహిళ ఆర్థికంగా ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని, వారిని శారీరకంగా లొంగదీసుకుని, రహస్యంగా వీడియోలు తీసి భారీ మొత్తంలో నగదు డిమాండ్‌ చేస్తోంది. ఇటీవల శాస్త్రిరోడ్‌ కు చెందిన ఓ బడా వ్యాపారిని ఇదే తరహాలో లొంగదీసుకుంది. ఇద్దరు కలిసిన వీడియో తన వద్ద ఉందని, అందుకు రూ.10 లక్షలు ఇవ్వాలని, లేకపోతే, సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తానని బెదిరింపులకు దిగింది. పాల్వంచ, ఇల్లెందు పట్టణాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు డబ్బుల కోసం రాయబారం నడపడం గమనార్హం. దీంతో సదరు వ్యాపారి అంతమొత్తం ఇచ్చుకోలేక చివరికి పోలీసులను ఆశ్రయించాడు.

ఈ క్రమంలో ఆ వ్యాపారితో డబ్బులు కొంత మొత్తం ఇస్తామని రప్పించి మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె ఫోన్‌ డాటా, ఫోన్‌ లో ఉన్న చిత్రాలను పరిశీలించగా.. మరికొందరు కూడా ఈ ఊబిలో చిక్కుకున్నారనే విషయం వెలుగు చూసినట్లు సమాచారం. కేటీపీఎస్‌ డీఈ స్థాయి అధికారి, మరో ఫోర్‌ మెన్, భద్రాచలానికి చెందిన ఓ వ్యక్తి కూడా వలపు వలలో పడ్డట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఇంకెంత మంది ఉన్నారు. ఏ స్థాయిలో డబ్బులు కాజేశారనే విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.
Tags:    

Similar News