దేనికైనా సిద్ధం ..మాకు మందు కావాలంతే !

Update: 2020-05-08 13:30 GMT
నిన్న , మొన్నటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండేది. కానీ , లాక్ డౌన్ నుండి మద్యం దుకాణాలకు ఎప్పుడైతే సడలింపు ఇచ్చారో అప్పటినుండి దేశ వ్యాప్తంగా మందు గురించి ..మందుబాబుల గురించి ఒకటే చర్చ. ఒక్కొక్క రాష్ట్రం మెల్లిమెల్లిగా మద్యం అమ్మకాలకి ఒకే చెప్తూ వస్తుంది. మూడు రోజుల పాటు తర్జనబర్జన పడిన తమిళనాడు ప్రభుత్వం చివరికి మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే మద్యం కొనుగోలు చెయ్యడానికి తమిళనాడు ప్రభుత్వం కొన్ని షరతులు విధించడంతో మందుబాబులు షాక్ తిన్నారు.

మద్యాన్ని ఆధార్ లో ఉన్న వయస్సు ను బట్టి అమ్ముతున్నారు. అయితే , మందుబాబులు మాత్రం ఒక్క ఆధార్ కార్డు మాత్రమే కాదు ఓటర్ కార్డు ..రేషన్ కార్డు ..ఇలా ఏ కార్డు అయిన తీసుకువస్తాం మాకు మందు ఇవ్వండి చాలు అని అంటున్నారు. మందుబాబులకు ముందుగా టోకన్లు ఇస్తున్నారు. ఇన్ని నియమాలు పెట్టినా గురువారం ఒక్కరోజు దాదాపు రూ. 150 కోట్లకు పైగా విలువైన మద్యం విక్రయించామని ఓ అధికారి అంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రెండు రోజుల పాటు తమిళనాడులో లిక్కర్ షాప్ లో తెరుచుకోలేదు. ఈ దెబ్బకు మందుబాబులు ఆందోళనకు గురైనారు.తమిళనాడులో మద్యం కొనుగోలు చెయ్యాలంటే చాలా నిబంధనలు ఉన్నాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాలను తమిళనాడు ప్రభుత్వం పాటిస్తోంది. మద్యం కొనుగోలు చేసే వ్యక్తి తప్పనిసరిగా మాస్కు పెట్టుకుని వెంట ఆధార్ కార్డు తీసుకెళ్లాలి. వారానికి రెండు సార్లు మాత్రమే ఒక్కోవ్యక్తి లిక్కర్ కొనుగోలు చెయ్యడానికి అవకాశం ఇస్తున్నామని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. హోల్ సేల్ విక్రయాలు ఉండకూడదని, బార్ అండ్ రెస్టారెంట్లు తియ్యకూడదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఒక్క వ్యక్తి ఎక్కువ మద్యం కొనుగోలు చెయ్యడానికి అవకాశం ఇవ్వకుండా చూడటానికే ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. అయితే , మందుబాబులు మాత్రం ఇన్ని నియమాలు పెట్టినా మాకు ప్రాబ్లెమ్ లేదు ..మందు ఇవ్వండి చాలు అంటున్నారు.

అలాగే తమిళనాడు ప్రభుత్వం వయసుల వారీగా మద్యాన్ని విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. 50 ఏళ్లు పైబడిన వారు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 40-50 ఏళ్ల మద్య వయసు ఉన్న వారు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు, 40 ఏళ్ల లోపు వయసు ఉన్న వాళ్లు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల్లోగా మద్యం కొనుగోలు చెయ్యాలని తమిళనాడు ప్రభుత్వం సూచించింది. అలాగే , ఒక్క మనిషి ఒక్కసారి 750 మి.లీ. మద్యం కొనుగోలు చెయ్యడానికే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆధార్ కార్డ్ తప్పకుండా ఎంట్రీ చెయ్యాలని నియమాలు పెట్టామని టాస్మాక్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిలోష్ కుమార్ స్పష్టం చేశారు. మొత్తం మీద ఎన్ని నియమాలు పెట్టినా తమిళనాడులో ఒక్కరోజులో రూ. 150 కోట్ల విలువైన లిక్కర్ విక్రయించారని వెలుగు చూడటంతో చాల మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News