ఆధార్ కార్డు అన్నిటికీ ఆధారమైనా ఏటీఎం కార్డులు - క్రెడిట్ కార్డుల్లా దాన్ని జేబులో పెట్టుకుని తిరిగే అవసరం లేకపోవడంతో చాలామంది దాన్ని బీరువాలో పెట్టి దాచేస్తారు. అవసరమైనప్పుడే తీస్తారు. ఇప్పటివరకు బీరువాల్లో ఉన్న ఆధార్ కార్డులన్నీ ఇకపై బీరువాలుగా మారబోతున్నాయి. అవును... బీరువాలో డబ్బులున్నట్లే.. ఆధార్ కార్డు కూడా డబ్బుల వ్యవహారాలకు కేంద్ర బిందువు కానుంది. ఆధార్ కార్డు ఇకపై మనీపర్స్ కానుంది. నగదు రహిత లావాదేవీలకు ప్రజలు ఖచ్చితంగా అలవాటు పడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంటోంది. నగదుతో పాటు ప్లాస్టిక్ కరెన్సీని కూడా బంద్ చేసి కేవలం ఒక్క ఆధార్ నంబర్ ఆధారంగానే మొత్తం ఆర్థిక లావాదేవీలన్నీ నడిచేలా ప్లాన్ చేస్తోంది.
ఈ మేరకు బ్యాంకు ఖాతాలన్నింటిని ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ వేగవంతం కావాలని నీతి ఆయోగ్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. రెవెన్యూ - గ్రామపంచాయితీ అధికారుల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల్లో నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలనీ నీతి ఆయోగ్ కలెక్టర్లకు సూచించింది. 2017 మార్చి నాటికి దేశం మొత్తం నగదురహిత లావాదేవీలు పూర్తిస్థాయిలో జరిగేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై పెట్టింది.
ఆధార్.. ఫోన్.. వేలి ముద్ర ఆధారంగా ఆర్థిక వ్యవస్థను నడిపే దిశగా కేంద్రం విధానం రూపొందిస్తోంది. అది పూర్తియితే... ఆధార్ నంబరును చెప్పి.. మీ వేలి ముద్రను ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే చాలు చెల్లింపులు, నగదు బదిలీ వంటివన్నీ చేసుకోవచ్చు. ఇందుకోసం ఇకపై వచ్చే ఫోన్లన్నీ ఫింగర్ ప్రింట్ స్కానర్ - ఐరిస్ స్కానర్ ఉండేలా తయారీదారులను కేంద్రం కోరనుంది. మొత్తానికి మరో ఆర్నెళ్లలో దేశం సమూలంగా మారిపోయేలా కనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/