ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యలంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ఐదు రాష్ర్టాల ఎన్నికలు నిరుత్సాహ పరుస్తున్నాయి. గోవా అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. గోవా, పంజాబ్ లో అధికారంపై ఆశలు పెట్టుకున్న ఆ పార్టీకి ఫలితాలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. పంజాబ్ లో పార్టీ కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ అధికారానికి అవసరమైన స్థానాలు సాధించడంలో వెనుకబడింది. ఇక గోవాలో అయితే కనీసం ఖాతా కూడా తెరిచే పరిస్థితి లేకుండా పోయింది.
మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూతో కలిసి పంజాబ్ లో సత్తా చాటుకోవాలని ఆప్ భావించింది.అయితే సిద్దూ చివరి నిమిషంలో కాంగ్రెస్ లో చేరారు. దీంతో కేజ్రీవాల్ అంతా తానై ప్రచారం చేసినప్పటికీ అది విజయాన్ని చేకూర్చలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/