తన తల్లిని అవమానించారన్న అంశంపై పవన్ చేసిన ట్వీట్లు ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. దీనికి తోడు ఈ రోజు ఉదయం ఫిలింఛాంబర్ వద్దకు చేరుకున్నపవన్ కల్యాణ్.. గంటల కొద్దీ అక్కడే ఉండటం.. తలుపులు వేసుకొని ఉన్నట్లుగా చెబుతున్నారు. తన తల్లిని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చిన పవన్ ఫిలిం చాంబర్లో ఉండిపోగా.. ఆయనకు మద్దతుగా ఛాంబర్ బయట పవన్ అభిమానులు భారీగా చేరుకున్నారు.
తన ట్వీట్లలో టీవీ9.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తనపై కుట్ర పన్నుతుందన్న ఆరోపణలు చేసిన పవన్ కారణంగా.. ఆయన అభిమానులు ఈ రెండు చానళ్లకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చారు. ఒకదశలో టీవీ9.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి హటావో.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ రెండు ఛానళ్లను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేయటం కనిపించింది.
ఇదిలా ఉండగా.. పవన్ అభిమానులుగా చెబుతున్న గుర్తు తెలియని యువకులు కొందరు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌కు చెందిన ఓబీ వ్యాన్ పై రాళ్ల దాడి చేశారు. ఈ దాడితో వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఏబీఎన్ కు చెందిన మరో వాహనం కూడా స్వల్పంగా ధ్వంసమైంది. ఈ ఘటనకు కారణమైన వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా తెలుస్తోంది.