శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారు. కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి.. మనుషులను చంపుతున్నాయి. మనల్నే కాదు.. కడుపులోని పిండాలను సైతం కబళించేలా వాతావరణం తయారవుతోందని సర్వేలో తేలింది.
గాలి కాలుష్యంతో అబార్షన్లు జరుగుతాయని ఓ సర్వేలో తేలింది. భారత్-పాకిస్తాన్ సహా దక్షిణాసియా ప్రాంతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాల కంటే అధిక స్థాయిలో కాలుష్యం ఉందని తెలిపింది.
ఈ కాలుష్యం వల్ల అబార్షన్లు, పుట్టిన వెంటనే బిడ్డ మరణించడం వంటి పరిస్థితులకు కారణం అవుతోందని తెలిపింది.
29శాతం అబార్షన్లకు వాయుకాలుష్యమే కారణమని సర్వే తేల్చింది. ముఖ్యంగా కాలుష్యం అత్యధికంగా ఉండే ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఈ మరణాలకు ఆస్కారం ఎక్కువని తేలింది.గ్రామీణ ప్రాంతాల్లో 30 సంవత్సరాలు దాటిన మహిళల్లో ఈ కాలుష్యం కనిపిస్తోందని తేలింది.