వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని 17 బ్యాంకులకు టోకరా వేసి లండన్ వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఈ విషయంలో తనను ఎన్ని ఫరవాలేదని... తన కుమారుడిని మాత్రం ఒక్క మాట కూడా అనొద్దని అంటున్నారు. రుణాల చెల్లింపు కేసులో తన కుమారుడు సిద్ధార్థ మాల్యాను ఎందుకు విమర్శిస్తున్నారంటూ ఆయన ట్విట్టర్ లో మండిపడ్డారు. బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టిన కేసులో సిద్ధార్థ మాల్యా తప్పేమీలేదని ఆయన చెప్పారు. రుణాలు చెల్లించాల్సింది తానే కానీ సిద్ధార్థ కాదని... తిట్టాలనుకుంటే తనను తిట్టాలి కానీ సిద్ధార్థ ను మాత్రం తిట్టొద్దని ట్వీట్ చేశారు.
కాగా మాల్యా తన కేసు విషయంలో నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బ్యాంకులు ఇచ్చిన రుణాలను తప్పకుండా తీరుస్తానని పిటిషన్ దాఖలు చేశారు. మాల్యా దాఖలు చేసిన పిటిషన్ పై కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కురియన్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ ముందు జరిగిన ఈ విచారణలో మాల్యా తరఫు న్యాయవాది కీలక ప్రతిపాదన చేశారు. తొలి విడతగా రూ.4 వేల కోట్లను చెల్లించేందుకు మాల్యా సిద్ధంగా ఉన్నారన్నారు. సెప్టెంబర్ లోగా ఈ చెల్లింపులను పూర్తి చేస్తారన్నారు. వాదనలు విన్న తర్వాత కేసును ఏప్రిల్ ఏడో తేదీకి వాయిదా వేశారు.