తెలంగాణ ఏసీబీకి డీమానిటైజేషన్ ఎఫెక్టు మామూలుగా తగల్లేదు. అయితే. అందులో ఏసీబీ స్వయం కృతాపరాథమూ ఉంది. 2015లో ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 50 లక్షలకు సంబంధించిన ఆధారాలను చిన్న పొరపాటు కారణంగా చెరిపేశారు. దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ నిర్ణయించడంతో ఏసీబీ అధికారులు తమ వద్ద ఉన్న 50 లక్షల పాత నోట్లను వృథాగా వదిలేయరాదన్న ఉద్దేశంతో దాన్ని ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడానికి కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. అదంతా రేవంత్ రెడ్డి డీల్ లో దొరికిన డబ్బు. అంతవరకు బాగానే ఉంది... కానీ.. ఫిక్స్ డ్ చేసే తొందరలో వారు ఆ డబ్బుకు సంబంధించిన నంబర్లు కానీ, ఫొటోలు కానీ ఏవీ వద్ద తమ వద్ద ఆధారాలుగా ఉంచుకోకుండా తీసుకెళ్లి బ్యాంకులో వేసేశారు.
50 లక్షలు బ్యాంకులో వేసేసి హమ్మయ్య డీమానిటైజేషన్ ను జయించేశాం అని జబ్బలు చరుచుకున్న ఏసీబీకి ఆ తరువాత తెలిసింది అసలు సంగతి. అది ఏసీబీ కేసులో పట్టుకున్న డబ్బు. కేసులో కీలక ఆధారం అదే. కానీ... ఇప్పుడు అది వారి వద్ద లేదు. మరి కోర్టులో ఎలా నిరూపించాలి. రేవంత్ రెడ్డి అడ్డం తిరిగి ఆ డబ్బేది చూపించమంటే ఏం చేయాలన్న న్యాయ సంకటం వారికి మొదలైంది. న్యాయ నిపుణులూ అదే చెబుతున్నారు. ఏసీబీయే స్వయంగా ఆధారాలు చెరిపేసిందని అంటున్నారు.
అయితే.. కేసును నీరుగార్చడానికి ఉద్దేశపూర్వకంగానే డీమానిటైజేషన్ సందర్భాన్ని వాడుకున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇక రేవంత్ అడ్డం తిరగడమే తరువాయి. కేసు నుంచి బయటపడడానికి ఏసీబీ ఆయనకు మంచి మార్గం చూపించినట్లయింది.