మరో సంచలనం. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులు ఎంత ఉండొచ్చు? నెల జీతం మీద బతికే అతగాడి ఆస్తి రూ.100కోట్ల మించి ఉండటం సాధ్యమేనా? లాంటి షాకింగ్ అంశాలు ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి. విజయవాడలోని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ గా పని చేస్తున్న ఆదిశేషు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా అతని ఆస్తులపై ఏకకాలంలో దాడులు జరిపిన అధికారులకు విస్మయకర అంశాలు బయటకు వచ్చాయి.
ఆదిశేషు ఆస్తుల విలువ దాదాపు రూ.100కోట్లు వరకూ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి అతని ఆస్తుల విలువ రూ.100కోట్లుగా భావిస్తున్నప్పటికీ.. సోదాలు మొత్తం పూర్తయ్యే సరికి దీని విలువ రూ.100కోట్లకు పైనే ఉంటుందన్న అంచనా వ్యక్తమవుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆదిశేషు మీద ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఇతడి ఆస్తులు ఈ రేంజ్ లో ఉండటం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది.