మూడో ప్రపంచ యుద్ధంపై మేధావుల కొట్లాట

Update: 2017-09-06 04:17 GMT
ఉత్తర కొరియా దుందుడుకు వైఖరి... ట్రంప్ తెంపరితనం కారణంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదముందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్న తరుణంలో టెస్లా - స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ అసలు మూడో ప్రపంచ యుద్ధం ఎందుకు వస్తుందో తన అభిప్రాయాన్ని చెప్పారు. మూడో ప్రపంచ యుద్ధమంటూ వస్తే అది ఎలా ఉంటుందో ఆయన వర్ణించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు రంగంలో పోటీ, ఆధిపత్యం కోసం మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని జోష్యం చెప్పారు. ఆయన వాదనలను మరో టెక్ జెయింట్ ఫేస్ బుక్ అధిపతి అయిన జుకర్ బర్గ్ ఖండించారు. దీంతో ఇద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా సంవాదం జరిగింది.
    
ఈ టెక్నాలజీ - ఇలాంటి రోబోల విషయంలో  అమెరికా - చైనా - ఇండియా ముందుంటాయని.. దాదాపు అన్ని దేశాలూ కృత్రిమ మేథస్సుపై పరిశోధనలు జరుపుతున్నాయని ఆయన తెలిపారు. ఈ రంగంలో ఉండే ప్రైవేట్‌ సంస్థలను సైతం ప్రభుత్వాలు నియంత్రించి తమ ఆధీనంలో ఉంచుకుంటాయని ఆయన చెప్పుకొచ్చారు. మూడో ప్రపంచ యుద్ధం కారణంగా మానవ నాగరికతకు ముప్పు ఉన్న దేశాల జాబితాలో ఉత్తర కొరియా మాత్రం లేదని చెప్పారు. రష్యాతోపాటు అన్ని దేశాలకు కృత్రిమ మేథస్సు కీలకమైందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేసిన ప్రకటన నేపథ్యంలో ఆయన ట్విట్టర్లో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే, ఎలాన్‌ మస్క్‌ ట్వీట్లను ఫేస్‌ బుక్‌ సీఈవో జుకర్‌ బర్గ్‌ ఖండించారు. బాధ్యతారాహిత్యంతో కూడిన వ్యాఖ్యలని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఎలాన్‌ మస్క్‌ స్పందిస్తూ జుకర్‌ బర్గ్‌ కు ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌పై తెలిసింది కొంత మాత్రమేనని వ్యాఖ్యానించారు.
    
ఎలాన్ మస్క్ ట్వీట్ ఇదీ..
    
China, Russia, soon all countries w strong computer science. Competition for AI superiority at national level most likely cause of WW3 imo.
— Elon Musk (@elonmusk) 4 September 2017
Tags:    

Similar News