ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చేజారిపోయింది. రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇలా కేసులు పెరుగుతూ ఉంటే.. మరో వైపు ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీలు ఎక్కువయ్యాయి.
కరోనా వచ్చిందని ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే ఇప్పుడు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి నెలకొంది. పేదవారు పోతే ఇక ఆ బిల్లులు చూసి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ ఆస్ప్రతుల దోపిడీ తెలంగాణలో దారుణంగా ఉంది.
నల్గొండలోని సుప్రజ హాస్పిటల్ లో తాజాగా ఓ పేషెంట్ కు కరోనా వచ్చిందని చికిత్స తీసుకున్నాడు. అయితే చికిత్స పూర్తయ్యాక బిల్లు 15 లక్షలు అయ్యిందని చేతిలో పెట్టారు. అయితే ఆ రోగి బంధువులు కష్టపడి రూ.6 లక్షలు కట్టారు. మిగతావి కడితేనే రోగిని డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి యజమానులు బెదిరిస్తున్నారట..
దీంతో బాధితులు మంత్రి కేటీఆర్ కు గోడు వెల్లబోసుకున్నారు. సొంతిళ్లు లేదని.. భూమి లేదని.. మా అమ్మని కాపాడండి అని కేటీఆర్ ను ఆ రోగి బిడ్డ వేడుకుంది.
ఈ దారుణ ఘటనపై హీరో నిఖిల్ స్పందించాడు. పట్టపగలే ఇది నిలువుదోపిడీ అని.. హైదరాబాద్ కమిషనర్, సిటీ కమిషనర్, కేటీఆర్ సార్ న్యాయం చేయాలని చేతులెత్తి దండం పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

This is Daylight Robbery... Requesting @cpcybd @CPHydCity To please look into this injustice sir.