ఆసక్తికర వ్యాఖ్య ఒకటి బయటకు వచ్చింది. తమిళనాడు రాజకీయాలపై తమ ముద్ర వేయాలన్న ఆసక్తిని ప్రదర్శిస్తున్న కమల్.. రజనీల పార్టీల పరిస్థితి ఇప్పటివరకూ దూకుడుగా ఉన్నది లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఇద్దరు కథానాయకుల పార్టీలు ఏ మేర పోటీని ఇస్తాయి? అసలు పోటీ చేస్తారా? లేదా? అన్న దానిపై క్లారిటీ రాని పరిస్థితి.
ఇదిలా ఉండగా.. తమిళనాడులో అంతమంది నటులు స్పందించకున్నా.. తాజాగా శృంగారతారగా.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన షకీలా సంచలన ప్రకటన చేశారు. తనకు కమల్ హాసన్ అంటే ఎంతో ఇష్టమని.. ఆయన నటించిన సినిమాల్ని విడుదలైన రోజే చూస్తానని చెప్పారు. కమల్ రాజకీయాల్లోకి రావటం సంతోషంగా ఉందన్న షకీలా.. తనకు కానీ అవకాశం ఇస్తే కమల్ పార్టీలో చేరతానన్నారు.
తన అభిమాన నటుడు కమల్ హాసన్ ఆహ్వానిస్తే.. ఆయన స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీలో చేరేందుకు తాను రెఢీగా ఉన్నట్లు చెప్పారు. కుటుంబంలో ఉన్న పరిస్థితుల కారణంగానే తాను శృంగార తారగా నటించాల్సి వచ్చిందన్నారు. ఈ కారణంతోనే తనపై శృంగార తార అన్న ముద్ర పడిందని.. అది తన దురదృష్టమన్నారు. మిగిలిన నటీనటులు ఎవరూ కమల్ పార్టీలో చేరతానని చెప్పకున్నా.. కేరళ కుట్టి మాత్రం పార్టీలో చేరేందుకు రెఢీ అనటం గమనార్హం. మరి.. షకీలా ప్రకటనపై కమల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.