పార్లమెంట్ లో కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీ ఈ వ్యాఖ్యలపై భగ్గుమంటోంది. ఉభయ సభలు ఆందోళనతో అట్టుడికిపోయాయి. ఈ వ్యాఖ్యలు తప్పేవని కాంగ్రెస్ ఎంపీ క్షమాపణ చెప్పినా, బీజేపీ ఎంపీలు , కేంద్రమంత్రులు మాత్రం వెనక్కి తగ్గలేదు.
పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ పట్టుబట్టారు. ఒక దశలో సహనం కోల్పోయిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ తనను ఉరితీయాలని అనుకుంటే తీయవచ్చని చెప్పారు.
ఇక పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్లమెంట్ పక్ష నేత అధిర్ రంజాన్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రపతి పదవిలో ఓ తోలుబొమ్మను కూర్చోబెట్టారని.. ద్రౌపది రాష్ట్రపతి కాదని.. రాష్ట్ర‘పత్ని’ అని తీవ్ర అభ్యంతరకర కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ నోటిదురుసు బీజేపీ చేతికి ఆయుధం ఇచ్చినట్టైంది.
అధిర్ రంజాన్ వ్యాఖ్యలపై లోక్ సభలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లు కాంగ్రెస్ పై రెచ్చిపోయారు.అత్యున్నత పదవిలో ఉన్న మహిళను అవమానించడాన్ని సోనియాగాంధీ ఆమోదించారని స్మృతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా ఆదివాసీ, దళిత వ్యతిరేకి, స్త్రీ వ్యతిరేకి అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇక రాజ్యసభలో నిర్మలా సీతారామన్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఎంపీలను ఇష్టానుసారం మాట్లాడే స్వేచ్ఛను సోనియా ఇవ్వడం వల్లే రాష్ట్రపతిని అవమానించారని మండిపడ్డారు.సోనియా క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు.
ఇక బీజేపీ నిరసనలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందించారు. రాష్ట్రపతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశానని.. అందుకు క్షమాపణ చెబుతూ అధిర్ రంజన్ చేసిన ప్రకటనను ఆమె గుర్తు చేశారు. క్షమాపణ చెప్పిన తర్వాత.. అంతటితో విషయాన్ని వదిలేయాలన్నారు.
ఈ క్రమంలోనే ఈ మొత్తం వివాదానికి కేంద్రబిందువైన అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలు తప్పేనని.. ఉరితీస్తే తీయండంటూ బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా అధిర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ అయిపోయింది. అదిర్ వ్యాఖ్యలతో బీజేపీపై చెడ్డపేరు వచ్చింది.