అభంశుభం తెలియని అమయాకపు బాలుడు అతడు. తల్లి వదిలేసి పోయింది. తండ్రి అనారోగ్యంతో దిక్కులేని స్థితిలో రెండేళ్ల బాలుడు ‘గోపాల్ సజాని’ని ఓ అక్క వరుసయ్యే అమ్మాయి జాలిపడి చేరదీసింది.. తల్లిదండ్రి లేకపోవడంతో చేరదీసిన వారికి పనులు చేస్తూ సాయపడుతూ గోపాల్ చదువుకున్నాడు. కడుపేదరికం..9 మంది ఉన్నా గోపాల్ ను చేరదీసి ఆ కుటుంబ రెండు గదుల ఇంట్లో పెంచింది. అయితే ఇన్సూరెన్స్ కోసం ఓ లండన్ ప్రవాస భారతీయ జంట గోపాల్ ను దత్తత తీసుకుంది. అతడిపై భారీగా ఇన్సూరెన్స్ చేయించి చంపించింది. ఈ దారుణంగా కలకలం రేపింది.
గుజరాత్ రాష్ట్రంలోని జునాగౌడ్ జిల్లా మాలియా హతీనా గ్రామంలో అల్ఫా కర్ధానీ అనే ఆమె గోపాల్ ను చేరదీసి పెంచింది. ఇంగ్లండ్ దేశంలోని లండన్ లో ఉంటున్న ఆర్తి ధీర్ అనే 55 ఏళ్ల మహిళ, ఆమె భర్త కావల్ రాయ్ జాడ లు గోపాల్ ను దత్తత తీసుకుంటామని.. మంచి భవిష్యత్ ఇస్తామని అల్ఫా కర్ధానీని నమ్మించి ఈ అనాథ బాలుడికి భరోసా ఇచ్చారు.2014లో గోపాల్ ను దత్తత తీసుకున్నట్టు అతడి అక్క అల్ఫా కర్దానీ, బావతో ఒప్పందం చేసుకున్నారు. దత్తత పత్రాలు తీసుకున్న ఆర్తీధీర్, కావల్ జంట పెద్ద ప్లానే వేశారు.
గోపాల్ పై ‘వెల్త్ బిల్డర్’ అనే ప్రత్యేక పాలసీ చేశారు. ఈ పాలసీకి మామూలుకన్నా పదిరెట్లు ప్రీమియం కట్టాల్సి ఉన్నా కట్టేశారు. దాదాపు కోటి నలభై లక్షల రూపాయల పాలసీ చేశారు. అతడిని చంపేస్తే వారికి 100 కోట్ల వరకూ పాలసీ డబ్బులు వస్తాయి.
దీంతో 2017లో లండన్ లో కుట్రపన్నారు. ఆర్తీ ధీర్-కావల్ జంట ఇండియాకు వచ్చారు. వీసా ప్రాసెస్ కోసమని రాంచీకి గోపాల్ ను కారులో తీసుకెళ్లారు. తిరిగి వస్తుండగా ప్లాన్ ప్రకారం అతడిని కిరాయి హంతుకులతో కలిసి హత్య చేయించారు. 13ఏళ్ల గోపాల్ ను దారుణంగా చంపించారు. అడ్డు వచ్చిన అల్ఫా కర్ధానీ భర్త గోపాల్ ను కూడా చంపారు. కారు డ్రైవర్ కూడా వీరికి సహకరించాడు. అయితే ఎవరో దారిదోపిడీ గాళ్లు చేయించారని ప్రచారం చేశారు.
అయితే వీరి కుట్రను లండన్ పోలీసులు పసిగట్టారు. పాలసీ కోసమే బాలుడిని దత్తత తీసుకొని హత్య చేయించి క్లైయిమ్ చేశారని తేల్చారు. అయితే ప్రవాస భారతీయుల చట్టాలతో వారు లండన్ కోర్టులో తప్పించుకున్నారు. భారత దేశం వీరి కుట్రను తెలుసుకొని తమకు అప్పగించాలని చూసినా బ్రిటన్ నిరాకరించింది. ప్రస్తుతం నిందితులు లండన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు.
గోపాల్ ను - భర్తను కోల్పోయిన అల్ఫా న్యాయం కోసం ఇప్పుడు పోరాడుతోంది.