తెలంగాణ రాష్ట్రంలో కీలక నేతలుగా చెప్పే కేటీఆర్.. హరీశ్ లకు సంబంధించిన కొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది. దేశ వ్యాప్తంగా విద్వేష ప్రసంగాలు చేసే నేతల జాబితాను ఒక సంస్థ తయారు చేయగా.. ఈ ఇద్దరు బావా బావమరిదుల పేర్లు ఉండటం విశేషంగా మారింది. దేశ వ్యాప్తంగా విద్వేష ప్రసంగాలు చేసినందుకు 58 మంది ఎంపీలు.. ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి.
ఈ జాబితాను ప్రజాస్వామిక సంస్కరణల సంఘం తయారు చేసి.. తాజాగా విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా బీజేపీ నేతల పేర్లు ఉండటం గమనార్హం. మొత్తం 59లో యాభై శాతానికి కాస్త తక్కువగా అంటే.. 27 మంది బీజేపీ నేతల పేర్లు ఉన్నాయి. బీజేపీ తర్వాతి స్థానంలో మజ్లిస్ పార్టీకి చెందిన ఆరుగురు నేతల పేర్లు ఉంటే.. టీఆర్ ఎస్ పార్టీకి సంబంధించి ఆరుగురు పేర్లు ఉండటం విశేషం. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. టీఆర్ ఎస్ కు చెందిన అగ్రనేతలైన కేటీఆర్.. హరీశ్.. కవితల పేర్లు ఉండటం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
టీఆర్ ఎస్ తో పాటు టీడీపీకి చెందిన ముగ్గురు నేతలు.. శివసేనకు చెందిన ముగ్గురు.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఉన్నారు. ఇక.. జేడీయూ (2).. ఏఐయూడీఎఫ్ (1).. బీఎస్పీ (1).. డీఎంకే (1).. పీఎంకే (1).. ఎస్పీ (1) ఉన్నారు. ఇద్దరు ఇండిపెండెంట్ ప్రజాప్రతినిధులపైనా విద్వేష కేసులు ఉండటం గమనార్హం.
విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన నేతల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎవరు ఉన్నారని చూస్తే..
టీఆర్ఎస్
1. కేటీఆర్
2. హరీశ్ రావు
3. కవిత
4. పుట్టా మధుకర్
5. కొప్పుల ఈశ్వర్
6. తాటికొండ రాజయ్య
మజ్లిస్
1. అసదుద్దీన్ ఓవైసీ
2. అక్బరుద్దీన్ ఓవైసీ
3. ముంతాజ్ అహ్మద్ ఖాన్
4. సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ
5. మహ్మద్ మొజంఖాన్
6. అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా
టీడీపీ
1. కోడెల శివప్రసాద్ (స్పీకర్)
2. జీవీ ఆంజనేయులు
3. బండారు సత్యానారయణమూర్తి
బీజేపీ
1. రాజాసింగ్ (గోషామహాల్ ఎమ్మెల్యే)