48 గంటల తర్వాత గుహలోంచి సురక్షితంగా రాజు బయటకు..

Update: 2022-12-15 10:07 GMT
48  గంటల నరకయాతన తర్వాత గుహలో చిక్కుకుపోయిన వ్యక్తి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. తెలంగాణలోని కామారెడ్డిలో నిర్వహించిన ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు విజయవంతమైంది. పోలీసులు, అటవీ, అగ్నిమాపక శాఖ అధికారులు కలిసి చేసిన ఈ ప్రయత్నం ఫలించింది. బతుకుజీవుడా అంటూ ఆ వ్యక్తి బయటపడ్డాడు. రెండు రోజులుగా బండరాళ్ల మధ్య గుహలో చిక్కుకున్న రాజు రెండు రోజుల తర్వాత సురక్షితంగా బయటపడ్డాడు. దాదాపు 20 గంటల పాటు తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ టీం రాజును సేఫ్ గా బయటకు తీసుకొచ్చింది. మృత్యుంజయుడిగా బయటకొచ్చాడు.

కామారెడ్డి జిల్లా సింగరాజయల్లి గుహల్లో ఈ రెస్క్యూ ఆపరేషన్జరిగింది. దాదాపు 80 మంది అధికారులు చేసిన ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. రెండు రోజులుగా మంచినీరు, ఆహారం లేక నీరసించిపోయిన రాజుకు ఫ్లూయిడ్స్ ను అందించారు.

వేటకోసం వెళ్లిన రాజు అనే వ్యక్తి తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని గుట్టల్లో 48 గంటలకు పైగా చిక్కుకుపోయాడు. రాజు మంగళవారం సాయంత్రం రెడ్డిపేట నుంచి గణపూర్ తండా మీదుగా సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో అడవిలో వేటకు వెళ్లాడు.

రాళ్లపై నుంచి వెళ్తుండగా రాజు  సెల్ ఫోన్ కింద పడిపోయింది. దానిని తీసేందుకు ప్రయత్నించి  ఆ రాళ్ల మధ్య ఉన్న గుహలో ఇరుక్కుపోయాడు. అతడితో వచ్చిన స్నేహితుడు కొందరు గ్రామస్థులకు సమాచారం అందించాడు.బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో రాజు ఒకరోజుకు పైగా లోపలే ఉండిపోయాడు. ఇంతలో అతడిని రక్షించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా కుదరలేదు. అనంతరం వారు పోలీసులకు సమాచారం అందించగా వారు సహాయక చర్యలు చేపట్టారు.

బుధవారం మధ్యాహ్నం వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మేము అతనికి నీరు , ఓఆర్ఎస్ సరఫరా చేసాము.జేసీబీ, ఇతర అధికారుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు.. జేసీబీ సాయంతో రాళ్లను తొలగించి రాజును బయటకు తీసే ప్రయత్నం చేశారు. జిలెటిన్ స్టిక్స్ తోవరుసగా బ్లాస్టింగ్స్ చేశారు. ఆ తర్వాత రాజుకు అడ్డుగా ఉన్న బండరాళ్లను తొలగించడంతో రాజు కాళ్లు బయటకు కనిపించాయి. దీంతో రాజును జాగ్రత్తగా బయటకు తీసుకువచ్చారు రెస్క్యూ టీం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News