రాజకీయంగా జరిగే కొట్లాటలు.. గొడవలు ఎంత హీట్ జనరేట్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటివి చోటు చేసుకున్నప్పుడు సదరు రాజకీయ నేతలు చిందులు తొక్కేస్తుంటారు. దీనికి భిన్నంగా కూల్ గా.. అదేమంత పెద్ద విషయం కాదన్నట్లుగా తేల్చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అంతేనా.. సదరు గొడవల సందర్భంగా ఆమె చెప్పిన మాట ఒకటి అవాక్కు అయ్యేలా చేస్తోంది.
బెంగాల్ లోని అసన్ సోల్ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఒకప్పటి హీరోయిన్ మూన్ మూన్ సేన్ బరిలోకి దిగారు. ఎన్నికల సందర్భంగా హాట్ హాట్ గా వ్యాఖ్యలు చేసుకోవటం మామూలే. ఈ విషయంలో మూన్ మూన్ సేన్ సైతం తక్కువేం తినలేదు. పోలింగ్ వేళ.. బెంగాల్ లోని పలు నియోజకవర్గాల్లో గొడవలు జరిగాయి.
అసన్ సోల్ లోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. నియోజకవర్గ పరిధిలోని పలుచోట్ల తృణమూల్ కాంగ్రెస్.. బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులునెలకొన్నాయి. పరిస్థితిని కంట్రోల్ లోకి తెచ్చేందుకు పోలీసులు నానా యాతన పడాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.
అసన్ సోల్ లో జరిగిన రచ్చ మీద మీడియా అడిగిన ప్రశ్నకు మూన్ మూన్ సేన్ ఇచ్చిన సమాధానం షాకింగ్ గా మారింది. ఉదయం తనకు టీ రావటం ఆలస్యం కావటంతో తాను లేటుగా నిద్ర లేచానని.. దాంతో అసన్ సోల్ లో గొడవలు జరిగాయన్న విషయం తెలీదంటూ ఆమె చెప్పిన మాటలు అవాక్కు అయ్యేలా చేస్తున్నాయి. అయినా.. రాజకీయ పార్టీల మధ్య ఇలాంటి గొడవలు ఎక్కడైనా జరుగుతాయి. బెంగాల్ గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుకోవాలి? పోలింగ్ ప్రక్రియ చూద్దామని వచ్చా.. ఓటర్లు వారికి నచ్చిన పార్టీలకు ఓటు వేయనివ్వకుండా చేస్తున్నారంటూ ఆరోపించారు.
రాజకీయ నేతకు అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో.. అందునా పోలింగ్ వేళ.. టీ రావటం ఆలస్యం కావటంతో లేటుగా నిద్ర లేచానని చెప్పిన మూన్ మూన్ సేన్ మాటలు ఆసక్తికరంగానే కాదు.. అమ్మ.. సేన్.. అనుకునేలా చేస్తున్నాయని చెప్పక తప్పదు. బెంగాల్ రాజకీయాలకు సరిగ్గా సూట్ అయ్యేలా సేన్ మేడమ్ ఉంది కదూ!