ఇలాగైతే ఇండియాలో చదువు చెట్టెక్కినట్లే..

Update: 2019-09-15 06:58 GMT
ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ లో భారత విద్యాసంస్థలు ఒక్కటి కూడా చోటు సంపాదించలేకపోయాయి. 2020 ఏడాదిగానూ టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌(టీహెచ్ ఈ) ‘వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌’ జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్‌ కు చెందిన ఏ ఒక్క విద్యాసంస్థ కూడా టాప్‌-300లో చోటు దక్కించుకోలేకోయింది. ఈ విధంగా టాప్‌-300లో భారత విద్యాంసంస్థలు లేకపో వడం 2012 నుంచి ఇదే తొలిసారి.

టీహెచ్ ఈ వరుసగా 16వ ఏడాది ప్రపంచంలోని యూనివర్సిటీలకు ర్యాంకులు కేటాయిస్తూ జాబితాను విడుదల చేసింది. 92 దేశాల నుంచి దాదాపు 1300కు పైగా యూనివర్సిటీల ప్రదర్శ నను పరిశీలించిన అనంతరం ర్యాంకులను కేటాయించింది. భారతదేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థ అయిన ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌ సీ) బెంగళూరు.. ఈ సారి తన ర్యాంకును దిగజార్చుకున్నది. గతేడాది ఈ సంస్థ ర్యాంకు 251-300 గ్రూపులో ఉండగా.. ఈ ఏడాది అది 301-350 జాబితాలోకి చేరిపోవడం గమనార్హం. మరోపక్క- ఐఐటీ రోపార్‌ తొలిసారి ఈ జాబితాలో నిలిచింది.

ఐఐఎస్‌ సీ బెంగళూరుతో సమానంగా 301-350 జాబితాలో చేరింది. దాదాపు ఏడు భారత యూనివర్సిటీలు ఈ ఏడాది తక్కువ ర్యాంకులకు పడిపోయాయి. అయితే మిగతా విద్యాసంస్థలు మాత్రం తమ స్థానాలను అలాగే పదిలంగా ఉంచుకున్నాయి. ఇక ఐఐటీ- ఢిల్లీ(401-500) - ఐఐటీ-ఖరగ్‌పూర్‌ (401- 500) - జామియా మిల్లియా ఇస్లామియా వంటి విద్యాసంస్థలు ఈ ఏడాది చక్కని ప్రదర్శననే కనబర్చాయి.

దాదాపు 56 భారత యూనివర్సిటీలు ఈ ఏడాది జాబితాలో నిలిచాయి. గతేడాది ఈ సంఖ్య 49గా ఉంటే ఏడు యూనివర్సిటీలు కొత్తగా జాబితాలో చేరడం గమనార్హం. కాగా, ఈ జాబి తాలో వరుసగా నాలుగోసారి ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలిచింది. తాజా ర్యాంకింగ్స్‌లో యూఎస్‌ - యూరోప్‌ - బ్రిక్స్‌ దేశాలకు చైనా గట్టి పోటీనిచ్చి చక్కటి ప్రదర్శనను కనబర్చింది. ఈ జాబితాలో యూఎస్‌ - జపాన్‌ దేశాల నుంచి 110 చొప్పున విద్యా సంస్థలు స్థానం దక్కించుకున్నాయి. యూకే నుంచి 100 యూనివర్సిటీలు జాబితాలో ఉండగా.. చైనా నుంచి 81 విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి.


Tags:    

Similar News