కేసీఆర్ త‌ర్వాత‌.. కేటీఆర్ దే సీఎం కుర్చీ: మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2022-10-19 08:35 GMT
తెలంగాణ రాష్ట్రానికి భావి ముఖ్య‌మంత్రి కేటీఆరేన‌ని తేల్చేశారు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌. అయితే, ఆయ‌న దీనికి సంబంధించి స‌మ‌యం చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. "ఐదేళ్లు ప‌ట్టొచ్చు.. ప‌దేళ్లు ప‌ట్టొచ్చు.. ఎప్ప‌టికైనా తెలంగాణ ముఖ్య‌మంత్రి పీఠం కేసీఆర్ త‌ర్వాత‌..కేటీఆర్‌దే" అని మంత్రి వ్యాఖ్యానించా రు. అంతేకాదు.. కేటీఆర్‌కు ముఖ్య‌మంత్రి అయ్యేందుకు అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. దీనికి ఆయ‌న మ‌రో కామెంట్ కూడా జోడించారు. టీఆర్ ఎస్ పార్టీలో ఎవ‌రిని అడిగినా.. ఈ మాటే చెబుతార‌ని అన్నారు.

వాస్త‌వానికి కొన్నాళ్లుగా ఇదే మాట ప‌లువురు మంత్రులు చెబుతూ వ‌స్తున్నారు. గ‌త 2018 ఎన్నిక‌ల‌కు ముందు కూడా.. ప‌లువురు ఇదే వ్యాఖ్య చేశారు. తొలుత సికింద్రాబాద్ ఎమ్మెల్యే ప‌ద్మారావు, త‌ర్వాత‌.. మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్‌లు కూడా.. ఇవే కామెంట్లు చేశారు. "కేటీఆర్ సీఎం అవుతారు.

సీఎం చేస్తాం. దీనిలో త‌ప్పేముంది" అని వ్యాఖ్యానించారు. అయితే.. అప్ప‌టికే.. రాష్ట్రం లో కుటుంబ పాల‌న న‌డుస్తోంద‌ని.. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఎవ‌రికి ఉద్యోగాలు వ‌చ్చినా..రాకున్నా.. కేసీఆర్ కుటుంబానికి మాత్రం రాజ‌కీయ నియామ‌కాలు జ‌రిగిపోయాయ‌ని.. ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శించాయి.  

ఇక‌, మంత్రి మ‌ల్లా రెడ్డి మ‌రో అడుగు ముందుకు వేసి.. కేసీఆర్ కంటే కూడా.. తెలంగాణకు కేటీఆర్ సీఎం అయితే.. బాగుంట‌ద‌ని.. మా అనుచ‌రులు భావిస్తున్నారంటూ.. ఏడాది కింద‌ట వ్యాఖ్యానించారు. ఇలా.. ఎప్ప‌టిక‌ప్పుడు.. సీఎం పోస్టు విష‌యం వ‌చ్చేస‌రికి..

మంత్రులు మ‌న‌సులో మాట దాచుకోలే క పోతున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు కేసీఆర్ ఎలానూ.. టీఆర్ ఎస్‌ను జాతీయ పార్టీగా ప్ర‌క‌టించి.. బీఆర్ ఎస్ చేసిన సంద‌ర్భంలో.. ఆయ‌న జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టిపెడ‌తారు. సో.. అప్పుడు.. కేటీఆర్ ఆటోమేటిక్‌గా.. పార్టీ త‌ర‌ఫున పార్టీఎల్‌పీ లీడ‌ర్ అవుతార‌నేది తెలిసిందే. అయితే.. మంత్రులు మాత్రం ముందుగానే హంగామా సృష్టిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News