ఇప్పటికే కరోనా మహమ్మారి మన దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఇక కరోనా పోయింది అని ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటున్న టైంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేసింది. గతంలో కేవలం వృద్ధులు మాత్రమే ఈ వ్యాధికి బలయ్యారు. ఈ సారి వయసుతో నిమిత్తం లేకుండా 30 నుంచి 40 ఏళ్ల వాళ్లు కూడా కరోనా బారినపడ్డారు. గతంతో పోల్చుకుంటే మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంటే కరోనా నుంచి కోలుకున్నవారికి ప్రస్తుతం మరో కొత్త వ్యాధి వస్తోంది. అదే బ్లాక్ ఫంగస్. ఈ వ్యాధి చాలా ఏళ్లుగా ఉన్నదే. అయితే ఇప్పుడు కరోనా నుంచి కోలుకున్నవాళ్లలో ఈ వ్యాధి కనిపిస్తున్నది. ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి? ఇది ఎటువంటి పరిస్థితుల్లో వస్తుంది? తదితర వివరాలు తెలుసుకుందాం..
ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నవారు చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి.. ముకోర్ మైకోసిస్ అనే ఫంగస్ వల్ల వస్తుంది. ఇది ఎన్నో ఏళ్లుగా ఉంది. ఈ వ్యాధి లక్షణాలు ఇవే.. ముఖం లోని కండరాలు తిమ్మిరెక్కడం. కళ్ళు ఎర్రబడడం, కొన్ని సందర్భాల్లో కళ్లు వాపుకు గురవుతాయి. ముక్కులో ఒక్క పక్క మూసికొనిపోయినట్టు ఉండడం. అయితే ఈ వ్యాధి కొన్ని విషపూరితమైన పుట్టగొడుగుల వల్ల సోకుతుతుందని డాక్టర్లు చెబుతున్నారు. సరైన టైంలో చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి నుంచి కోలుకోవచ్చని చెబుతున్నారు.
కరోనా వైరస్‌కు ఈ వ్యాధికి ఎటువంటి సంబంధం లేదని వైద్యులు అంటున్నారు. అయితే ఇటీవల నమోదైన కేసులు మొత్తం కరోనా నుంచి కోలుకున్నవారికి మాత్రం రావడంతో ఈ వ్యాధిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నా భయాందోళన చెందవలసిన అవసరం లేదని.. వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే.. వ్యాధి నుంచి తొందరగానే కోలుకోవచ్చని వైద్యులు అంటున్నారు. అయితే లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయొద్దని అలా చేస్తే ప్రాణానికే ప్రమాదం కలగొచ్చని హెచ్చరిస్తున్నారు. మరోవైపు రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవాళ్లకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.