శరత్ కుమార్ అడ్డంగా బుక్కయ్యాడే..

Update: 2017-04-12 10:04 GMT
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక రద్దు నేపథ్యంలో ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ అవుతున్న పేరు.. శరత్ కుమార్. అన్నాడీఎంకే తరఫున పోటీ చేసిన దినకరన్ కానీ.. మిగతా అభ్యర్థుల గురించి ఇప్పుడు జనాలు పెద్దగా చర్చించుకోవట్లేదు. ప్రధానంగా అందరూ వేలెత్తి చూపిస్తున్నది శరత్ కుమార్ నే. ప్రస్తుతం చర్చంతా కూడా అతడి చుట్టూనే తిరుగుతోంది.

సినీ జనాలతో పాటు సామాన్యులందరూ కూడా శశికళ విషయంలో తీవ్ర వ్యతిరేకతతో ఉన్న సమయంలో ఆమె వైపు నిలబడి.. ఆ వర్గం తరఫున ఉప ఎన్నికల్లో నిలబడిన దినకరన్ కు మద్దతు ప్రకటించడతోటే శరత్ కుమార్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. అది చాలదన్నట్లు ఇప్పుడు ఆదాయపు పన్ను అధికారుల దృష్టిలోనూ పడ్డాడు శరత్. అతడి ఇంటి మీద.. రాధికా శరత్ కుమార్ కార్యాలయాల మీద ఆదాయపు పన్ను అధికారులు దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే.

ఉప ఎన్నికల్లో పంచడానికి శశికళ వర్గం ఏకంగా రూ.100 కోట్లు సిద్ధం చేసిందని.. ఇందుకు శరత్ కుమార్ ను ఉపయోగించుకునే ప్రణాళిక కూడా రూపొందించారని.. ఇంతలో ఉప ఎన్నిక రద్దవడం.. అంతగా గందరగోళంగా మారిందని అంటున్నారు. శరత్ కుమార్ ఈ డీల్ లో భాగంగా స్వయంగా రూ.10 కోట్లు పుచ్చుకున్నట్లుగా ఆదాయపు పన్ను అధికారులు గుర్తించినట్లు వార్తలొస్తున్నాయి. దినకరన్ కు మద్దతు ప్రకటించినందుకు.. డబ్బు పంపకానికి సహకరిస్తున్నందుకు శరత్ కు ఇది నజరానా అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి శరత్ ఏ ఉద్దేశంతో శశికళ వర్గం వైపు వచ్చాడో కానీ.. మొత్తం కథంతా అడ్డం తిరిగి ఇప్పుడు పెద్ద చిక్కుల్లోనే పడ్డాడు. ఆయన్ని పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News