పెళ్ల‌యిన మూడు నెల‌ల‌కే.. వివాహిత ఆత్మ‌హ‌త్య‌.. అది కూడా పోలీస్ స్టేష‌న్ ముందే!

Update: 2022-10-20 16:33 GMT
క్షణికావేశం.. కాపురంలో క‌ల‌హాలు.. వెర‌సి.. కాళ్ల‌పారాణి కూడా ఆర‌క‌ముందే.. వివాహిత ప్రాణాలు తీసుకుంది. ``మీ స‌మ‌స్య‌లు మేం ప‌రిష్క‌రిస్తాం.. చెప్పండి.`` అని పోలీసులు ఆ న‌వ దంప‌తుల‌కు కౌన్సెలింగ్ ఇస్తున్న స‌మ‌యంలోనే.. ఆమె స్టేష‌న్ వెలుప‌ల‌.. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డం.. రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది.

నేటి ప్రేమ‌లు.. పెళ్లిళ్ల‌లో అనేక వివాదాలు.. క‌నిపిస్తున్నాయి. అయితే.. వాటిని ప‌రిష్క‌రించుకునేందుకు కూడా అనేక మార్గాలు ఉన్నాయి. అయితే.. ఆ స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించుకోకుండా.. క్షణికావేశంలో.. ప్రాణాలు క‌ల్పోతున్న వారు ఎక్కువ‌గా ఉండ‌డం విషాదం క‌ల్పిస్తోంది.

ఏక్క‌డ‌.. ఏం జ‌రిగింది?

విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీకి చెందిన శ్రావణి(గుంటూరు), వినయ్‌(విశాఖ‌)లు మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కెఆర్ఎం కాలనీలో కాపురం పెట్టారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీనిపై త‌ర‌చుగా వారి  మ‌ధ్య‌గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. చివ‌ర‌కు అవి..  పోలీస్స్టేషన్ కు చేరాయి. దంపతులకు ఎస్సై శ్రీనివాస్‌ కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. ``గొడ‌వ‌లు ప‌డ‌కండి.. `` అని స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే.. ఇంత‌లోనే..  శ్రావణి కింది అంతస్తుకు వెళ్లి పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది.

వెంటనే పోలీసులు అప్రమత్తమై మంటలార్పేందుకు యత్నించారు. మంటలను ఆర్పే క్రమంలో ఎస్సై శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన శ్రావణిని పోలీసులు ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందూ ఆమె మృతి చెందింది. దీంతో పోలీసులు గుంటూరులోని శ్రావణి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

ప్రేమ బ‌రువైందా?!
 
గుంటూరుకు చెందిన శ్రావణికి, విశాఖకు చెందిన వినయ్‌తో మూడు నెలల కిందటే ప్రేమ వివాహం జరిగింది. వినయ్‌కు మందు కొట్టే అలవాటు ఉంది. దీంతో  భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త మద్యానికి బానిసై తనను వేధిస్తున్నాడని పోలీసులకు శ్రావణి ఫిర్యాదు చేసింది. భార్యభర్తలకు కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు పోలీసులు గురువారం పోలీస్‌ స్టేషనకు పిలిపించారు. దంపతులకు ఎస్సై శ్రీనివాస్‌ కౌన్సిలింగ్‌ ఇస్తుండగానే ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది.

మనస్తాపంతో  స్టేషన్‌ బయటికి వచ్చిన శ్రావణి.. ఒంటిపై పెట్రోల్‌ పొసుకొని నిప్పంటించుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలు ఆర్పేందుకు యత్నించారు. తీవ్ర గాయాలపాలైన శ్రావణిని పోలీసులు సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. పోలీసులు గుంటూరులోని శ్రావణి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి.. భర్తను అదుపులోకి తీసుకున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News