చాలా చిన్న విషయాలే అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. అదో పెద్ద వివాదంగా మారిపోతున్న తీరు చూస్తే.. ఆశ్చర్యంతో పాటు.. బాధ కలుగుతుంది. ప్రస్తుతం ఢిల్లీలోని జేఎన్ యూ వర్సటీలో జరుగుతున్న రచ్చను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇంతకీ.. జేఎన్ యూలో ఏం జరుగుతుంది? ఆ వివాదం ఏమిటి? జేఎన్ యూ విద్యార్థుల వెనుక లష్కరే తాయిబా వ్యవస్థాపకుడి హస్తం ఉందంటూ కేంద్రహోంమంత్రి చేసిన సంచలన వ్యాఖ్యలో నిజం ఎంత? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..
ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరితీతను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జేఎన్ యూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అతడి వర్థంతిని క్యాంపస్ లో నిర్వహించేశారు. ఒక ఉగ్రవాదిని దోషిగా న్యాయస్థానాలు తేల్చేసి.. ఉరిశిక్ష వేయాలని నిర్ణయించి.. అతనికి ఉరిశిక్ష అమలు చేయటం.. దాన్ని కొందరు విద్యార్థులు వ్యతిరేకించటం ఏమిటి? దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే వ్యక్తులు.. దేశంపై యుద్ధాన్ని ప్రకటించే వారి విషయంలో ఉదారంగా వ్యవహరించటం.. వారికి మద్దతుగా మాట్లాడటం భావస్వేచ్చ అంటూ కొన్ని రాజకీయ పక్షాలు.. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా నిలవటం లాంటి ఉదంతాలు విస్మయానికి గురి చేయక మానవు.
ఉగ్రవాది అఫ్జల్ గురుకు ఉరితీతను వ్యతిరేకించటం.. అతని వర్థంతిని వర్సిటీ క్యాంపస్ లో నిర్వహించిన ఇష్యూలో కొందరు జేఎన్ యూ విద్యార్థులపై దేశద్రోహం కేసులు నమోదు చేశారు. దీనిపై జేఎన్ యూకి చెందిన కొందరు విద్యార్థులు మండిపడుతున్నారు. దీనికి నిరసనగా మరిన్ని ఆందోళనలు జేఎన్ యూలోని కొందరు విద్యార్థులు చేస్తుంటే.. వారికి మద్దుతుగా కాంగ్రెస్.. కమ్యూనిస్ట్ పార్టీ నేతలు రంగంలోకి దిగటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. అఫ్జల్ గురు ఇష్యూ మీద జేఎస్ యూ విద్యార్థుల్లో కొందరు చేస్తున్న ఆందోళనలకు వ్యతిరేకంగా ఏబీవీపీ విద్యార్థి సంఘం వారు నిరసనలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో జరుగుతున్న విషయాల్లో మంచి ఏమిటి? చెడు ఏమిటి? అన్న ప్రశ్నల తెర మీదకు రావటం లేదు. అంతకు మించి భావస్వేచ్ఛ.. విద్యార్థులు మాట్లాడుతుంటే వారి నోటిని కేసుల పేరుతో నొక్కేస్తున్నారంటూ చిత్రమైన వాదనలు బయటకు వస్తున్నాయి.
ఒక ఉగ్రవాదిని బాహాటంగా సమర్థించటం.. దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేలా వ్యవహరించిన వ్యక్తి వర్థంతి సభను క్యాంపస్ లలో నిర్వహించటాన్ని తప్పుపట్టే కన్నా.. అలాంటి వారికి మద్దతు పలికేందుకు కొన్ని పార్టీలు సిద్ధంగా ఉండటం విశేషం. దీంతో.. ఈ వ్యవహారం మొత్తం ఒక రాజకీయ అంశంగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ కు మద్దుతుగా నిలుస్తున్న జేఎన్ యూ విద్యార్థి సోదరులకు మద్దతు ఇవ్వాల్సిందిగా మన పాక్ సోదరుల్ని కోరుతున్నా’’ అంటూ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయిద్ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.
ఇలాంటి ట్వీట్లను కాంగ్రెస్.. కమ్యూనిస్టులతో పాటు.. అఫ్జల్ గురు ఉరిని వ్యతిరేకిస్తున్న విద్యార్థుల్లో ఏ ఒక్కరూ ఖండించలేదు. దేశాన్ని అస్థిరపరిచే శక్తులకు సంబంధించిన అంశాలకు మద్దుతుగా రాజకీయ పక్షాలు మాట్లాడటమేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్న సమయంలోనే వారికి తోడు ఉన్నానంటూ ఉగ్రవాద సంస్థ అధినేత ట్వీట్ చేయటం విశేషం. ఇలాంటి సమయంలోనే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అలహాబాద్ లో మాట్లాడుతూ.. జేఎన్ యూలో అఫ్జల్ గురు వర్థంతిని నిర్వహించటం విచారకరమన్న ఆయన.. జేఎన్ యూలో చోటు చేసుకుంటున్న ఆందోళన వెనుక లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయిద్ హస్తం ఉందంటూ సంచలన వ్యాఖ్య చేశారు.
దీనికి ఆధారాలు ఏమిటని రాజ్ నాథ్ ను కాంగ్రెస్.. కమ్యూనిస్టులు ప్రశ్నిస్తున్నారు. ఆధారాలు చూపాలని డిమాండ్ చేసే రాజకీయ పార్టీలు.. అంతకు ముందే.. హఫీజ్ సయిద్ చేసిన ట్వీట్ గురించి ఎందుకు మాట్లాడరో అర్థం కాదు. మోడీ సర్కారును రాజకీయంగా దెబ్బ తీయాలన్న భావనతో ఉన్న కాంగ్రెస్.. కమ్యూనిస్టు నేతలు భారీ తప్పు చేస్తున్నారు. ఉగ్రవాదుల్ని.. ఉగ్రవాద సంస్థల్ని వెనకేసుకొచ్చేలా మాట్లాడటం చూస్తుంటే.. ఈ దేశాన్ని ఏం చేయాలని వారు భావిస్తున్నారన్న సందేహం కలగటం ఖాయం.
మోడీని రాజకీయంగా దెబ్బ తీసేందుకు మతాన్ని ఇప్పటికే విచ్చలవిడిగా వాడేస్తున్న విపక్షాలు.. ఇప్పుడు ఇలా ఉగ్రవాదుల్ని వెనకేసుకురావటం ఏమిటో..? ఒక పట్టాన అర్థం కాదు. ఓపెన్ గానే ఉగ్రవాదుల వర్థంతుల్ని వర్సటీ క్యాంపస్ లలో నిర్వహించేందుకు బరి తెగిస్తున్న వారిపై దేశద్రోహం కేసులు ఎందుకు పెట్టకూడదు? మొన్నా మధ్య ఇలాంటి పనికే పాల్పడిన హైదరాబాద్ వర్సిటీ విద్యార్థి రోహిత్.. ఆ తర్వాత కాలంలో ఆత్మహత్య చేసుకోవటం.. దీనికి దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేప్టటటం చూస్తే.. ఈ దేశంలో.. దేశం కోసం ప్రాణాలు తీసుకున్న వారిని స్మరించుకోవటం కంటే.. దేశాన్ని దెబ్బ తీసే ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లాడటం.. అలాంటి వారికి రాజకీయ మద్దతు లభిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇంతకు మించిన దురదృష్టం ఇంకేం ఉండదేమో..? ఇలాంటి చిత్రమైన పరిస్థితులు భారత్ లో తప్ప మరే దేశంలోనూ చోటు చేసుకోవేమో..?