అమ్మ పార్టీ ఒక్క పైసా విరాళం తీసుకోలేదట

Update: 2019-08-18 06:57 GMT
రాజకీయ పార్టీలు ఏవైనా సరే విరాళాలు లేకుండా మనలేవు. చేతిలో పవర్ ఉన్నా లేకున్నా విరాళాల దారి విరాళాలదే. ఆ మాటకు వస్తే.. పవర్ ఉన్న పార్టీకి విరాళాలు భారీగా వచ్చేయటం తెలిసిందే. అందుకు భిన్నంగా గత ఏడాదిలో తమ పార్టీ ఒక్క పైసా కూడా విరాళాలు సేకరించలేదన్న ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.

2018-19లో రాజకీయ పార్టీలు తాము సేకరించిన విరాళాలకు సంబంధించి వివరాల్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకూ ఐదు పార్టీలు మాత్రమే ఈ వివరాల్ని ఈసీకి అందజేశారు. ఈ ఐదు పార్టీల్లో నాలుగు విపక్ష భూమిక పోషిస్తుంటే.. ఒక్కటి మాత్రమే అధికార పక్షంగా ఉంది. తమిళనాడు అధికారపక్షంగా ఉన్న అన్నాడీఎంకే వెల్లడించిన వివరాలు ఆసక్తికరంగా మారాయి. గత ఏడాది తాము ఒక్క పైసా కూడా విరాళాల రూపంలో సేకరించలేదని.. అన్నాడీఎంకే తన నివేదికలో స్పష్టం చేసింది. పవర్ లో ఉండి కూడా పైసా విరాళం తీసుకోని పార్టీగా అన్నాడీఎంకేను చెప్పాలి.

దీనికి భిన్నంగా తాము పవర్ లో ఉన్న వేళ.. భారీగా విరాళాలు వచ్చినట్లుగా ఏపీలో విపక్ష భూమిక పోషిస్తున్న టీడీపీ పేర్కొంది. గత ఏడాదిలో తాము రూ.26.17 కోట్ల మొత్తం విరాళాల రూపంలో అందినట్లుగా పేర్కొన్నారు. పార్టీకి వచ్చిన రూ.26 కోట్ల విరాళంలో అత్యధికంగా ప్రూడెంట్ ఎన్నికల ట్రస్ట్ విరాళం ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. అప్పట్లో టీడీపీ నేతలుగా ఉన్న పలువురు పార్టీకి భారీగా విరాళాలు ఇచ్చినట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి రూ.25 లక్షలు.. రఘురామ కృష్ణంరాజు రూ.20 లక్షలు.. టీడీపీ సీనియర్ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు.. మాజీ ఎమ్మెల్యే బూర్గుల శేషారావు.. వేగ్నేశ వర్మ తదితరులు రూ.5లక్షల చొప్పున విరాళాన్ని ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. రూ.20వేలకు మించి విరాళాన్ని ఇచ్చిన వారిలో నేతలు 56 మంది ఉన్నట్లు పార్టీ వెల్లడించింది.

ఇదిల ఉంటే.. మిగిలిన మూడు పార్టీలు (శిరోమణి అకాలీదళ్.. ఐఎన్ ఎల్ డీ.. మహారాష్ట్ర నవనిర్మాణ సేన) తమ నివేదికల్ని అందించాయి.శిరోమణి తమకు రూ.1.75 కోట్ల విరాళాలు వచ్చినట్లు వెల్లడిస్తే.. మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన రూ.79 లక్షలు విరాళాలు అందినట్లుగా వెల్లడించారు. ఒక.. ఐఎన్ ఎల్ డీ రూ.1.75 కోట్ల మొత్తం విరాళం రూపంలో వచ్చినట్లుగా ఆయా పార్టీలు పేర్కొన్నాయి.
Tags:    

Similar News