సంక్షోభంలో ఉన్నప్పుడు షాకులు తినటమే తప్ప షాకులివ్వటం సాధ్యం కాదు. చాలాచాలా తక్కువ మంది మాత్రమే దీనికి మినహాయింపు. తాజాగా తమిళనాడు పాలకపక్షంలో చోటు చేసుకున్న అంతర్గత సంక్షోభం ముచ్చట తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో చిన్నమ్మను చాలామంది తప్పు పట్టారు. ఆమెకు వ్యతిరేకంగా పోస్టింగుల మీద పోస్టింగులు పెట్టేశారు. సోషల్ మీడియాలో చిన్నమ్మను చెడుగుడు ఆడుకున్నారంటే నమ్మండి.
మామూలుగా అయితే.. ఇలాంటి వాటి విషయాల్లో చిన్నమ్మ అండ్ కో చుక్కలు చూపించేవారు. కానీ.. సంక్షోభ పరిస్థితులు నెలకొన్న వేళ.. సోషల్ మీడియా మీద ఫోకస్ చేయలేదు. తాజాగా విషయాలన్నిఒక కొలిక్కి రావటం.. చేజారిపోతుందని భయపడ్డ పవర్ కాస్తా చేతికి రావటంతో.. పరిస్థితుల్ని తమకు తగ్గట్లుగా మార్చుకునే దిశగా ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి.
సంక్షోభ సమయంలో తమ ఇమేజ్ ను భారీగా దెబ్బ తీసిన సోషల్ మీడియా మీద ఫోకస్ చేసిన అన్నాడీఎంకే ఐటీ విభాగం. శశికళకు వ్యతిరేకంగా తయారు చేసిన పోస్టింగులు.. ప్రచారంపై వారు ఫోకస్ చేశారు. చిన్నమ్మ ఇమేజ్ ను డ్యామేజ్ అయ్యేలా పోస్టింగులు పెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇలా ప్రచారం చేస్తున్న కొందరిని ఇప్పటికే గుర్తించామని.. వారిపై చర్యలు మొదలెట్టామని హెచ్చరిస్తున్నారు.
చిన్నమ్మ.. పన్నీర్ ఎపిసోడ్ లో.. అమ్మ సమాధి దగ్గకు వెళ్లిన శశికళ.. సమాధిపై మూడుసార్లు కొట్టిన వైనంపై కామెడీ కామెడీ చేసేస్తున్నారట. ఇలాంటి వాటిపై అన్నాడీఎంకే ఐటీ విభాగం ఇప్పుడు కన్నెర్ర చేసింది. చిన్నమ్మ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. చేతిలో పవర్ ఉన్న వేళ.. ఏమైనా చేసేస్తారు మరి. ఎందుకైనా మంచిది ఎటకారపు పోస్టింగులు చేసే వారు.. కేసుల మాట గురించి కాస్త ఆలోచించి అడుగు ముందుకేస్తే మంచిది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/