దేశంలోనే అత్యంత సున్నితమైన సమస్యగా గుర్తింపబడిన అయోధ్య లోని రామ జన్మభూమి, బాబ్రీ మసీదు స్థల వివాదం తాజాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ఎన్నో రోజులుగా విచారణ జరుగుతున్నా కూడా కేవలం విచారణతో సరిపెట్టుకుంటూ వచ్చిన దేశ అత్యున్నతమైన ధర్మాసనం ... తాజాగా ఈ కేసుపై తన తుది తీర్పుని వెల్లడించింది. ఆ వివాదాస్పదమైన భూమి హిందువులకే చెందుతుంది అని తన తీర్పు లో వెల్లడించింది. హిందూ- ముస్లిం సంస్థల మధ్య వివాదానికి కారణమైన 2.77 ఎకరాల స్థలాన్ని చట్టప్రకారం ఆలయ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి ,ఆ ఆలయ ట్రస్ట్‌కు ఈ స్థలాన్ని అప్పగించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారం మొత్తం మూడు నెలల్లో పూర్తి చేయాలని ధర్మాసనం నిర్దేశించింది. అలాగే మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో వేరే చోట సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్‌కు 5 ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
అయోధ్య పై సుప్రీం తీర్పు వెల్లడించిన నేపథ్యంలో .. దీనిపై సమావేశం అయిన సున్నీ వక్ఫ్ బోర్డు ..ఈ తీర్పు పై రివ్యూ పిటిషన్ వేయబోమని తెలిపింది. కానీ , ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సుప్రీం తీర్పు పై రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఇకపోతే మసీద్ కోసం ఇస్తామన్న ఆ ఐదు ఎకరాల స్థలాన్ని స్వీకరించాలా? లేదా? అనేది మంగళవారం జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయించనున్నారు. కానీ , దీన్ని కూడా ఏఐఎంపీఎల్‌బీ వ్యతిరేకించింది. మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాలు ఇస్తామన్న ప్రతిపాదనను అంగీకరించబోమని ఏఐఎంపీఎల్‌బీ స్పష్టం చేసింది. అలాగే అయోధ్య కేసులో ముఖ్య పిటిషనర్ అయిన ఇక్బాల్ అన్సారీ మాత్రం రివ్యూ పిటిషన్ వేసే ఆలోచన లేదన్నారు.