ఆరేళ్లుగా ఆ ఎయిర్ హోస్టెస్ ను వేధిస్తున్నాడ‌ట‌!

Update: 2018-05-30 05:11 GMT
అదే ప‌నిగా వేధింపులు. అది కూడా నెలో.. రెండు నెల‌లో కాదు.. ఏకంగా ఆరేళ్లుగా. మాన‌సిక న‌ర‌క‌యాత‌కు శారీర‌కంగా లొంగ‌దీసుకోవ‌టానికి అదే ప‌నిగా ప్ర‌య‌త్నాల‌తో ఆ ఎయిర్ హోస్టెస్ విసిగిపోయింది. ఏం చేయాలో పాలుపోని నేప‌థ్యంలో ఏకంగా దేశ ప్ర‌ధానే జోక్యం చేసుకోవాలంటూ శ‌ర‌ణు కోరింది. సంచ‌ల‌నంగా మారిన ఎయిరిండియా ఎయిర్ హోస్టెస్ ఆవేద‌న ఇప్పుడు క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది.

ఎయిరిండియాకు చెందిన ఒక సీనియ‌ర్ ఉన్న‌తాధికారి ఒక ఎయిర్ హోస్టెస్ మీద క‌న్నేశాడు. ఆమెను లొంగ‌దీసుకోవ‌టానికి తెగ ట్రై చేశాడు. లైంగికంగా లోబ‌ర్చుకునేందుకు ప‌లుమార్లు ప్ర‌య‌త్నించాడు. ఇత‌ర మ‌హిళా సిబ్బంది గురించి ఆమెతో అస‌భ్యంగా మాట్లాడేవాడు. అయినా లొంగ‌క‌పోవ‌టంతో ఆమెను ఆర్థికంగా దెబ్బ తీసేలా ప్లాన్ చేశాడు. ప్ర‌మోష‌న్లు ఆపేయ‌టం.. ఉద్యోగ‌స్తుల‌కు ఇవ్వాల్సిన ప్రయోజ‌నాల‌ను నిలిపివేసి.. ఆరేళ్లుగా ఆమెను ఎన్ని అవ‌స్థ‌ల‌కు గురి చేయాలో అన్నింటికి గురి చేస్తున్నాడు.

ఇంత జ‌రుగుతున్నా.. త‌న పేరు బ‌య‌ట‌కు వ‌స్తే ప‌రువు పోతుంద‌న్న భ‌యంతో నోరు మూసుకొన్న ఆమె.. త‌న‌కు జ‌రుగుతున్న అన్యాయాల‌కు స‌హించ‌లేక‌పోయింది. త‌న‌కు జ‌రుగుతున్న అన్యాయాల‌పైనా.. వేధింపుల‌పైనా గ‌త ఏడాది ఎయిరిండియా సీఎండీకి బాధిత ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు చేసింది. అయిన‌ప్ప‌టికీ ఎలాంటి ప‌లితం లేదు. దీంతో.. ఆమె ఈ నెల 25న ప్ర‌ధాని మోడీకి తాను ఎదుర్కొంటున్న మాన‌సిక క్షోభ‌ను తెలియ‌జేస్తూ లేఖ రాసింది.

ప్ర‌ధాని మోడీకి లేఖ రాయ‌టంతో ఈ ఇష్యూ వెలుగులోకి వ‌చ్చింది. తాను రాసిన లేఖ‌లో త‌న‌కు విమాన‌యాన మంత్రి సురేశ్ ప్ర‌భును క‌లుసుకునే అవ‌కాశం ఇస్తే.. త‌న‌ను వేధిస్తున్న మాన‌వ‌మృగం గురించి వివ‌రిస్తాన‌ని పేర్కొంది. సీఎండీకి కంప్లైంట్ చేసినా ఫ‌లితం లేక‌పోయిన వైనాన్ని ఆమె లేఖ‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పీఎంవో చొర‌వ‌తో ప్ర‌స్తుతం ఒక విచార‌ణ క‌మిటీని ఏర్పాటు చేశారు. ప్ర‌ధాని చెంత‌కు వ‌చ్చిన ఫిర్యాదుపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేప‌ట్టి అస‌లు విష‌యం ఏమిట‌న్న‌ది నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు. దీంతో.. ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్కింది. మ‌రి.. విచార‌ణ క‌మిటీ ఏం తేలుస్తుందో చూడాలి.
Tags:    

Similar News