ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాయించుకున్న ఎయిర్ ఇండియా విమాన సంస్థ.. ఇప్పుడు ఆ పేరును పోగొట్టుకోవడంతోపాటు.. డర్టీ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు మూడు రోజులు దేశాన్ని కుదిపేసిన.. మహిళపై మూత్ర విసర్జన ఘటన.. ఇంకా విమాన ప్రయాణికుల మది నుంచి మరువక ముందే.. మరో డర్టీ ఘటన జరిగింది. దీంతో "ఇది ఎయిర్ ఇండియా కాదు.. డర్టీ " అనే కామెంట్లు వస్తున్నాయి.
తాజాగా ఏం జరిగింది?
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులు కొందరు ఫుల్లుగా మందు కొట్టి దారుణమైన వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఎయిర్ హోస్టస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడటమేకాకుండా.. ఈ ఘటనలను అడ్డుకున్న కెప్టెన్‌పై దాడి చేసి, చిత్తు చిత్తుగా కొట్టేశారు. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి బిహార్ క్యాపిటల్ పాట్నా వెళ్లిన ఇండిగో విమానంలో జరిగిన ఘటన సంచలనం రేపింది.
ముగ్గురు వ్యక్తులు.. ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కారు. అప్పటికే ఫుల్లుగా మందు కొట్టి ఉన్నారు. ఈ క్రమంలో తమకు సౌకర్యాలు ఏమైనా కావాలా? అని అడిగేందుకు వచ్చిన ఎయిర్ హోస్టస్ చెయ్యి పట్టుకున్నారు. ఆమె నడుముపై చేయి వేశారు. దీంతో ఆమె అరవడంతో సెకండ్ కెప్టెన్ పరుగు పరుగున వచ్చి.. సదరు వ్యక్తులను నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే.. వారు అతనిపై దాడికి దిగారు.
ఈ క్రమంలో విమాన సిబ్బంది వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. రాత్రి 10 గంటలకు విమానం పాట్నాకు చేరుకోగానే సీఐఎస్‌ఎఫ్ అధికారులు నిందితుల్లో ఇద్దరిని పట్టుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. మరో వ్యక్తి పరారయ్యాడు. కాగా, నిందితులంతా బిహార్‌కు చెందినవారేనని అధికారులు తెలిపారు.
వీరికి రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) పార్టీతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు వీరు సన్నిహితులని జాతీయ మీడియా పేర్కొంది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.