బాధ్యతగా ఉండమని అంతా చెప్పేవారే. మరి.. అంతే బాధ్యతగా వ్యవహరించే వారికి గుర్తింపు లభిస్తుందా? అంటే అదో పెద్ద ప్రశ్న. ఉద్యోగి నిజాయితీగా ఉండాలని చెబుతారు. నిజాయితీతో వ్యవహరించే వారికి గుర్తింపు లభిస్తుందా? అంటే లేదనే చెప్పాలి. ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నంలో ఒక నిర్ణయాన్ని తీసుకుంది ఎయిరిండియా. ఈ సంస్థ చరిత్రలో తొలిసారి నిజాయితీకి పట్టం కట్టారు. రూల్స్ కు భిన్నంగా నిజాయితీతో పని చేస్తున్నందుకు గుర్తింపుగా ఒక ఉద్యోగికి పదోన్నతి లభించటం ఒక విశేషమైతే.. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
గడిచిన 29ఏళ్లుగా ఎయిరిండియాలో పని చేస్తున్న సుభాష్ చందర్ సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. తన బాధ్యతనను సమర్థంగా వ్యవహరించటంతోపాటు.. నిజాయితీకి నిలువెత్తు అద్దంగా నిలవటంతో అతన్ని సెక్యూరిటీ విభాగంలో ర్యాంక్ అధికారిగా ప్రమోషన్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. రూల్స్ ను అతిక్రమించి మరీ.. నిజాయితీకి పట్టం కడుతూ నిర్ణయం తీసుకున్నారు.
విమానయానానికి సంబంధించి రెండు కోర్సులు చేసిన ఈ సైన్స్ గ్రాడ్యుయేట్.. సంస్థ భద్రతా విభాగంలో పని చేయటం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎంతో నిజాయితీతో వ్యవహరించారు. పలు సందర్భాల్లో తనకు దొరికిన మొత్తాన్నిసంస్థకు అప్పజెప్పేవాడు. ఈ మధ్యనే (జూన్ నెలలో) హాంకాంగ్ నుంచి వచ్చిన ఒక విమానాన్ని తనిఖీ చేస్తుండగా.. రూ.5లక్షల విదేశీ కరెన్సీ లభించింది. వెంటనే ఆ పర్సును గుర్తించి.. సదరు ప్రయాణికుడికి అందజేసి తన నిజాయితీని మరోసారి ప్రదర్శించారు. ఇన్నేళ్లకు నిజాయితీ గ్రౌండ్స్ మీద ప్రమోషన్ ఇస్తూ నిర్ణయం తీసుకోవటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.