తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఊహించని షాక్ తగిలింది. విపక్షం అంటే చాలు విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉండే గులాబీదళం.. రహస్య మిత్రుడైన మజ్లిస్ విషయంలో మాత్రం కాస్తంత ఉదాసీనంగా ఉంటారు.
ఎంతైనా రహస్యస్నేహితుడు.. తమను ఇరుకున పెట్టేలా.. ఇబ్బంది పెట్టేలా మాట్లాడరన్న భరోసా తెలంగాణ అధికారపక్షంలో కనిపిస్తుంది. అలాంటి నమ్మకాన్ని పటాపంచలు చేయటమే కాదు.. ఒకలాంటి షాక్ ఇచ్చారు మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ. బడ్జెట్ పై మాట్లాడిన ఆయన.. అధికారపక్షం ఊహించని విధంగా విమర్శలు చేశారు.
ఈటెల రాజేందర్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను సింఫుల్ గా తేల్చేశారు. గత ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్‌కు కాపీ కట్ పేస్ట్ మాదిరిగా ఉందంటూ అక్బరుద్దీన్ ఓవైసీ తేల్చేయటంతో అధికారపక్షానికి షాక్ తగిలినంత పనైంది.
బడ్జెట్ లో చూపింత భారీగా గ్రాంట్ లు వచ్చే అవకాశమే లేదని తేల్చేసిన అక్బరుద్దీన్ మాటలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో పడినప్పటికీ.. వెంటనే సిట్యూవేషన్ ను అర్థం చేసుకున్న అధికారపక్ష సీనియర్ నేతలు అక్బరుద్దీన్‌కు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి బడ్జెట్ పై ప్రసంగం సందర్భంగా తెలంగాణ అధికారపక్షానికి షాక్ తగిలిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.