ఎన్నికలు మీదకు వచ్చి పడుతుంటే అధికారపక్షం ఎంత వేగంగా పని చేస్తుందో చెప్పటానికి ఇంతకు మించిన చక్కటి ఉదాహరణ మరొకటి ఉండదేమో. ఏ క్షణంలో అయినా ఎన్నికల ప్రకటన వెలువడుతుందన్న వేళ.. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఎంత వేగంగా పని చేస్తున్నారో తాజాగా ఆయన ప్రారంభించిన శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
ఎన్నికల కోడ్ వచ్చి పడిందంటే.. ఇక చేసేదేమీ లేని నేపథ్యంలో.. ప్రభుత్వం తరఫున చేయాల్సిన కార్యక్రమాల్ని వరుసగా ఆయన చేసిపారేస్తున్నారు. ఐదేళ్లు అధికారం ఇచ్చినా.. సగటు స్టూడెంట్ మాదిరే.. ఎగ్జామ్ కు కాసేపు ముందు ఎంత హడావుడి పడుతూ చదివేస్తుంటాడో.. అదే తీరులో అఖిలేశ్ సర్కారు వ్యవహరిస్తోంది.
కేవలం నాలుగంటే నాలుగు గంటల వ్యవధిలో ఆయన రికార్డు స్థాయిలో రూ.50వేల కోట్ల విలువైన 300 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు..ప్రారంభోత్సవాల్ని చేసేశారు. వంద ఎకరాల్లో ఐటీ సిటీ.. రూ.983 కోట్లతో కేన్సర్ ఆసుపత్రి.. రూ.850 కోట్లతో అంతర్జాతీయ కేంద్రం ఇలా భారీఎత్తున ఆమోదాలు ఇచ్చేశారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమింటంటే.. ఎన్నికల్లో మైలేజ్ పొందేందుకు వీలుగా.. పలు పథకాల్ని ప్రారంభిచేస్తున్నారు. ఇలా ప్రారంభించిన ప్రాజెక్టులు చాలా వరకూ ప్రజలకు అందుబాటులోకి రాకపోవటమే కాదు.. అవన్నీ ప్రజలు ఉపయోగించటానికి నెలల తరబడి సమయం ఉండటం చూస్తే.. అఖిలేశ్ హడావుడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
ఒకే రోజులో గంటల వ్యవధిలో ఆయన చేసిన శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలకు సంబంధించి ఒక ఆసక్తికర లెక్క కనిపిస్తుంది. మొత్తం 240 నిమిషాల వ్యవధిలో ఆయన 300 శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాల్ని చేయటాన్ని చూస్తే.. నిమిషం కంటే తక్కువ వ్యవధిలో ఆయన ఎడాపెడా ప్రారంభించిన కార్యక్రమాలు విస్మయాన్ని రేకెత్తిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/