మనదేశంపైకి దండెత్తి వస్తున్న చైనాకు బుద్ది చెప్పేందుకు ఆ దేశం రూపొందించిన పబ్ జీ గేమ్ ను భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ క్రమంలోనే ఆత్మనిర్భర భారత్ లో భాగంగా భారతీయులు రూపొందిస్తున్న ఫౌజీ ఆడండని తాజాగా బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ పిలుపునిచ్చాడు.
‘ఎన్ కోర్ గేమ్స్’ సంస్థ తాజాగా ‘ఫియర్ లెస్ అండ్ యూనైటెడ్: గార్డ్స్’ (ఫౌజీ) పేరుతో యాక్షన్ గేమ్ ను రూపొందించింది. హీరో అక్షయ్ కుమార్ నేతృత్వంలో ఈ గేమ్ రూపొందింది. ఈ గేమ్ గురించి అక్షయ్ ట్వీట్ చేశాడు.
ప్రధాని మోడీ ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమస్ఫూర్తితో ఫౌజీ గేమ్ ను సగర్వంగా ప్రకటిస్తున్నామని.. ఈ గేమ్ ఆడడం.. వినోదంతోపాటు మన సైనికుల త్యాగాల గురించి కూడా తెలుసుకుంటారని.. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20శాతం ‘భారత్ కా వీర్’ ట్రస్ట్ కు అందుతుందని అక్షయ్ ట్వీట్ చేశారు. త్వరలోనే ఈ గేమ్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.