ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా యుద్ధం భౌగోళిక ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిపోయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ మద్దతుగా అమెరికా, దాని మిత్ర దేశాలు, యూరోప్‌లో సగానికి పైగా దేశాలు నిలుస్తున్నాయి. ఇప్పటికే రష్యాపై అమెరికా నేతృత్వంలోని దాని మిత్ర దేశాలు తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
ఉక్రెయిన్‌పై రష్యా అణు ప్రయోగానికి దిగితే అందుకు ధీటుగా రష్యాపై అమెరికా దాడికి దిగుతుందని వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే రష్యాకు చెందిన వందలాది మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలపై అమెరికా తీవ్ర ఆంక్షలు విధించింది. రష్యా కూడా ఇందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. అమెరికాకు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లపై తమ దేశంలో నిషేధం విధించింది. వాటిని ఏకంగా ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. దీంతో అమెరికా - రష్యా మధ్య సంబంధాలు ప్రస్తుతం ఉప్పూనిప్పుగా మారిపోయాయి.
ఇలాంటి పరిస్థితుల్లో 155 ఏళ్ల కిందట చోటుచేసుకున్న సంఘటనను యుద్ధ నిపుణులు తలచుకుంటున్నారు. రష్యా అమ్మేసిన భూభాగాన్ని అమెరికా కొనుగోలు చేసింది. అంతేకాకుండా ఆ కొనుగోలు చేసిన భూభాగం అమెరికాలో 49వ రాష్ట్రంగా ఉండటం విశేషం.
ఈ వివరాల్లోకెళ్తే.. 1867 అక్టోబరులో రష్యా.. తన కింద ఉన్న అలస్కాను అమెరికాకు అమ్మేసింది. ఆ భూభాగమే నేడు అమెరికాలో 49వ రాష్ట్రంగా ఉన్న అలస్కా. అయితే నాడు రష్యా వద్దనుకున్న ఈ భూమి నేడు బంగారంగా మారిపోయింది. సహజనవనరుల పరంగా, భౌగోళికంగా, వ్యూహాత్మకంగా అలస్కా ఎంతో కీలకంగా మారింది.
మరి ఇంతటి కీలకమైన రష్యా తన భూభాగాన్ని ఎందుకు అమెరికాకు విక్రయించిందంటే.. పద్దెనిమిదో శతాబ్ది తొలినాళ్లలో ఉత్తర అమెరికా దాకా రష్యా సామ్రాజ్యం విస్తరించి ఉండేది. ఉత్తర అమెరికా సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న భూభాగమే అలస్కా.
అలస్కా.. మంచు, దట్టమైన అడవులు, పర్వతాలతో ఉండేది. దీంతో అలస్కా ప్రాంతం నివాసయోగ్యంగా పనికిరాదని రష్యా భావించింది. ఫలితంగా వందల సంఖ్యలో రష్యన్లు మాత్రమే ఇక్కడ నివసించేవారు. అంతేకాకుండా ఇది నాటి రష్యా రాజధాని సెయింట్ పీటర్స్‌బర్గ్ నుంచి చాలా దూరంలో ఉండేది.
ఈ కారణాలతోపాటు 1853-1856 దాకా సాగిన క్రిమియా యుద్ధం సాగింది. ఇప్పుడు దేశాలుగా ఉన్న బల్గేరియా, రుమేనియా, మాల్దోవాలతోపాటు రష్యాలో ఉన్న క్రిమియాలు అప్పట్లో అట్టోమాన్ (ప్రస్తుత టర్కీ) సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. ముస్లిం చక్రవర్తి పాలనలోని ఈ ప్రాంతాల్లోని క్రిస్టియన్లకు రక్షణగా రష్యా రంగంలోకి దిగింది. ఇది క్రిమియా యుద్ధానికి దారితీసింది.
మరోవైపు బ్లాక్ సీ (నల్ల సముద్రం)లో రష్యా నౌకా బలగాన్ని తగ్గించేయాలన్న ఉద్దేశంతో బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఆ యుద్ధంలో అట్టోమాన్ సామ్రాజ్యానికి మద్దతిచ్చాయి. ఈ యుద్ధంలో రష్యాకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏకంగా 12 వేల మంది ప్రాణాలను కోల్పోయింది. ఆర్థిక కష్టాలు కూడా చుట్టుముట్టాయి. దీంతో రష్యా జార్ చక్రవర్తి అలెగ్జాండర్-2 అలాస్కాను అమ్మేయాలని నిర్ణయించాడు.
మరోవైపు తమకు మించి ప్రాభవం సంపాదించుకుంటున్న బ్రిటన్‌పై అమెరికాకు మొదట్లో అయిష్టత ఉండేది. దీంతో శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు అమెరికా, రష్యా మధ్య స్నేహ సంబంధం చిగురించింది.
దీంతో తనకు శిరోభారంగా మారిన అలస్కాను అమెరికాకు అమ్మటానికి రష్యా మొగ్గుచూపింది. అలస్కా ధరను లక్ష డాలర్లుగా నిర్ణయించి 1859లో అమ్మకానికి పెట్టింది.
అయితే అమెరికా.. అలస్కాను కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు. మంచు, పర్వతాలు, అడవులతో నిండి నివాసయోగ్యం కాకపోవమే ఇందుకు కారణం. అంతే కాకుండా అప్పటికి అమెరికా అంతర్యుధ్ధంలో ఉంది. ఇక చివరికి 1865 ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ హత్యకు గురికావడం; అంతర్యుద్ధం ముగియటంతో అలాస్కాపై రెండు దేశాల మధ్య సంప్రదింపులు మళ్లీ మొదలయ్యాయి.
అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి విలియమ్ సీవార్డ్, రష్యా మంత్రి ఎడౌర్డ్ స్టోకెల్‌ల మధ్య 72 లక్షల డాలర్లకు ఒప్పందం కుదిరింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ సంతకం చేయడంతో 1867 అక్టోబరు 18న అలస్కా.. రష్యా చేతుల్లోంచి అమెరికాకు వెళ్లింది. 5,86,412 చదరపు మైళ్ల (సుమారు 36,50,00000 ఎకరాలు) భూమిని కేవలం 72 లక్షల డాలర్లకు రష్యా అమ్మేసింది. డాలర్‌కున్న ఈనాటి రూపాయి విలువ ప్రకారం చూసినా రష్యాకు ఆనాడు అమెరికా చెల్లించిన మొత్తం ఎకరాకు సుమారు రూ.40 మాత్రమే!
అమ్మేనాటికి అలస్కా ఎంత విలువైందో అటు అమెరికాకు, ఇటు రష్యాకు తెలియదు. రష్యా నుంచి కొనుగోలు చేశాక ఈ ప్రాంతాన్ని అమెరికా 30 ఏళ్లకు పైగానే పట్టించుకోలేదు. 1896లో అక్కడ అపారమైన బంగారం, చమురు ఇతర ఖనిజాలున్నాయని తేలటంతో అలస్కా రూపురేఖలు మారిపోయాయి.
ఇక 1939-45 వరకు జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో అలస్కా ప్రాంతం భౌగోళికంగా వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రాంతమైంది. ఆసియా-పసిఫిక్‌పై అమెరికా పట్టు సాధించడానికి అలస్కా కేంద్రమైంది. 1959 జనవరి 3న అలాస్కా అమెరికాలో 49వ రాష్ట్రంగా ఆవిర్భవించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.